జాతీయ వార్తలు

59 మంది ‘కోబ్రా’ కమాండోలు అదృశ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: జమ్మూనుంచి బిహార్‌లోని గయకు వెళ్తున్న సిఆర్‌పిఎఫ్‌కు చెందిన 59 మంది కోబ్రా కమాండోలు ఒక్కసారిగా అదృశ్యమవడం సంచలనం సృష్టించింది. అయితే వీరంతా ఎలాంటి అనుమతీ లేకుండా తమ ఇళ్లకు వెళ్లినట్లు తెలిసిందని సిఆర్‌పిఎఫ్ వర్గాలు సోమవారం తెలిపాయి. ‘ఇది డ్యూటీనుంచి అనధికారికంగా గైరుహాజరవడమే. ఈ సంఘటనపై కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీ చేపట్టాం. ఈ కమాండోలు లేదా వారి కుటుంబాలతో టచ్‌లోకి రాగలిగాం. వాళ్లంతా కూడా మంగళవారం నాటికల్లా తిరిగి వస్తామని హామీ ఇచ్చారు. అయితే నిబంధనల ప్రకారం వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుంది’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని అధికారి ఒకరు చెప్పారు.
శ్రీనగర్‌లోని సిఆర్‌పిఎఫ్ రిక్రూట్‌మెంట్ సెంటర్‌లో ఆరు నెలల పాటు గెరిల్లా యుద్ధంలో శిక్షణకోసం పంపిన 300 మందిలో వీరంతా భాగమని సిఆర్‌పిఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వీరంతా కూడా ఈ నెల 5న (ఆదివారం) తమ తొలి పోస్టింగ్ అయిన గయ వెళ్లడానికి జమ్మూలో సీల్డా ఎక్స్‌ప్రెస్ ఎక్కాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోవడం, రోడ్ల బ్లాకేడ్‌ల కారణంగా వీరందరినీ నాలుగు రోజుల ముందు అంటే 1వ తేదీనే జమ్మూకు పంపించడం జరిగింది. ముందే చేరుకున్నందున అక్కడ వేచి ఉండడానికి బదులు తమ గమ్యస్థానాలకు వెళ్లిపోతామని నిర్ణయించుకుని వారంతా మంగళవారం రైలెక్కారు. అయితే 3వ తేదీ రైలు మొగల్‌సరాయ్ చేరుకోగానే వారిలో 59 మంది అక్కడే దిగిపోవడానికి నిర్ణయించుకున్నారని ఆ ప్రకటన తెలిపింది. వారి స్వగ్రామాలు అక్కడికి దగ్గర్లోనే ఉండడంతో శని, ఆదివారాలు కుటుంబాలతో గడిపిన తర్వాత ఈ నెల 7న గయలో డ్యూటీకి రిపోర్ట్ చేయవచ్చని వారునుకున్నట్లుగా కనిపిస్తోందని ఆ ప్రకటన తెలిపింది. జవాన్ల వద్ద ఎలాంటి ఆయుధాలు లేవని, అంతేకాకుండా రైలెక్కే ముందు వారంతా తమ బృందం కమాండర్‌కు తెలియజేయలేదని కూడా అధికారులు చెప్పారు.