జాతీయ వార్తలు

అట్టుడికిన లోక్‌సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ఐయుఎంఎల్ నాయకుడు, ఎంపీ ఇ అహ్మద్ మరణంపై ఎన్‌డిఏ ప్రభుత్వం సరైన రీతిలో వ్యవహరించలేదంటూ కేరళకు చెందిన కాంగ్రెస్, వామపక్ష సభ్యులు సోమవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని స్తంభింపజేశారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమం సోమవారం కేవలం 5 నిమిషాలు మాత్రమే జరిగింది. అలాగే జీరో అవర్ చేపట్టలేదంటూ విపక్షం లోక్‌సభ నుంచి వాకౌట్ చేసింది.
సభ ఉదయం 11 గంటలకు సమావేశం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈ నెల ఒకటి, రెండు తేదీల్లో జరిగిన దుర్ఘటనల్లో మృతి చెందినవారికి సంతాపం తెలిపి 2 నిమిషాలపాటు వౌనం పాటించిన అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. అప్పటికే తమ సీట్లలో నిలబడి ఉన్న కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు ముఖ్యంగా కేరళకు చెందిన ఎంపీలు పోడియం వద్దకు వచ్చి అహ్మద్ మృతి విషయాన్ని ప్రస్తావించారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించేందుకు ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో అహ్మద్ గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ప్రభుత్వం ఆయన మరణించిన అంశాన్ని దాచి పెట్టేందుకు ప్రయత్నించిందని ప్రతిపక్ష ఎంపీలు ఆరోపించారు. పోడియం వద్ద నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అహ్మద్ మరణంపై సంతాపం తెలపటంతోపాటు ఆయన మరణానికి సంతాపంగా లోక్‌సభ ఒక రోజు సమావేశాన్ని కూడా వాయిదా వేశామని ఆమె వివరించారు. ‘మీరు ఈ అంశంపై ఇంకా ఏమైనా చెప్పేది ఉంటే జీరో అవర్‌లో మాట్లాడేందుకు అవకాశం ఇస్తాను’ అని స్పీకర్ చెప్పారు. అయితే కాంగ్రెస్, వామపక్షాలకు చెందిన సభ్యులు స్పీకర్ మాటలు పట్టించుకోకుండా పోడియం వద్ద నిలబడి నినాదాలు ఇస్తూ సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. దీంతో ఆగ్రహం చెందిన సుమిత్రా మహాజన్ సభను 12 గంటల వరకు వాయిదా వేసి వెళ్లిపోయారు.
కాగా లోక్‌సభలో సోమవారం జీరోఅవర్ కార్యక్రమం చేపట్టనందుకు నిరసనగా కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు సభనుంచి వాకౌట్ చేశాయి. మొదట సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిపించాల్సి ఉన్నందున జీరో అవర్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ప్రకటించారు. దీనికి ప్రతిపక్షం నిరసన తెలిపినా సుమిత్రా మహాజన్ తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభించాలని కేంద్ర పర్యటనాభివృద్ధి మంత్రి మహేష్ శర్మకు సూచించారు. మంత్రి మాట్లాడటం ప్రారంభించగానే కాంగ్రెస్‌పక్ష నేత మల్లికార్జున ఖర్గే లేచి ఇది మంచి పద్ధతికాదని స్పష్టం చేశారు. జీరో అవర్‌ను చేపట్టకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. అయితే స్పీకర్ సుమిత్రా మహాజన్ చర్చను కొనసాగించటంతో కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

చిత్రం..సోమవారం లోక్‌సభలో మాట్లాడుతున్న విపక్ష నేత మల్లికార్జున ఖర్గే