జాతీయ వార్తలు

వాటాలు తేలేదెప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 7: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం బుధవారం హైదరాబాద్‌లో జరుగనుంది. ఇప్పటివరకు జరిగిన బోర్డు సమావేశాల్లో కృష్ణా జలాల్లో వాటాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాలు ఎవరి వాదనలను వారు వినిపించడంతో వివాదాలు అలాగే కొనుసాగుతున్నాయి దీనికితోడు కర్నాటక ప్రభుత్వం తాజాగా ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడం, కృష్ణపై నాలుగుచోట్ల బ్యారేజీలు నిర్మించడం తాజాగా బోర్డు సమావేశంలో ప్రధాన అజెండా కాబోతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. కృష్ణా జలాల్లో కర్నాటక రాష్ట్రానికి కేటాయించిన వాటాకంటే ఎక్కువ నీటిని వినియోగించుకోవడంపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అత్యున్నత న్యాయస్థానంలో ఈ వివాదం పరిష్కారం కాకముందే ఆదరాబాదరగా కర్నాటక రాష్ట్రం బ్యారేజీలు నిర్మించుకోవడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆల్మట్టి ఎత్తుపెంచితే కృష్ణా డెల్టాకు నీటి కటకట తప్పదని ఆంధ్ర ప్రభుత్వం మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తోంది. కర్నాటక ప్రభుత్వ వైఖరిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో, కర్నాటకపై ఉమ్మడి పోరాటానికి సిద్ధమవుతున్నాయి. కృష్ణా జలాల పంపిణీపై తెలంగాణ, ఆంధ్ర ఇరు రాష్ట్రాల మధ్య ఏర్పడిన వివాదంలో వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేయడానికి ఈనెల 12న కేంద్ర నిపుణుల బృందం ఇరు రాష్ట్రాల్లో పర్యటించబోతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర నిపుణుల బృందం దృష్టికి కర్నాటక వైఖరిని తీసుకొచ్చి, ఏకాభిప్రాయంతో కలిసికట్టుగా పోరాడాలని రెండు తెలుగు రాష్ట్రాలు భావిస్తున్నాయి. బోర్డు సమావేశంలో ఈ అంశంపైనే ప్రధాన చర్చ జరుగనుందని సమాచారం. కేంద్ర నిపుణుల బృందం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై బోర్డు సమావేశంలో చర్చించనున్నట్టు తెలిసింది. ఇలాఉండగా నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వార్లలో నిల్వ ఉండే జలాల్లో 23 టిఎంసి తమకు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ససేమిరా అంగీకరించడం లేదు. ఈ వివాదంపై ఎటూ తేలడం లేదు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించింది. దీంట్లోభాగంగా పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించడానికి అవకాశం కల్పించింది. గోదావరి జలాలను ఎలాగూ కృష్ణకు తరలిస్తున్నందున తమకు వాటా ఇవ్వాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం పట్టుబడుతుంది. గోదావరి జలాల మళ్లింపునకు ప్రత్యామ్నాయంగా కృష్ణా జలాల్లో వాటా ఇవ్వాలని బ్రిజేశ్ ట్రిబ్యునల్ సూచించింది కూడా. అయితే ఈ ట్రిబ్యునల్ కేటాయింపులపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో గెజిట్ విడుదల కాలేదు. గెజిట్ విడుదల కాకముందే కృష్ణా జలాల్లో వాటా ఎలా ఇస్తామన్నది ఆంధ్రప్రదేశ్ వాదన. కర్నాటక ప్రభుత్వ వాదన మరోలా ఉంది. గోదావరి జలాలను కృష్ణాకు తరలించడానికి బదులుగా నాగార్జునసాగర్‌కు ఎగువనున్న రాష్ట్రాలు 80 టిఎంసి వాడుకోవచ్చని కూడా బ్రిజేశ్ ట్రిబ్యునల్ సూచించింది. ఈ ట్రిబ్యునల్ తీర్పుమేరకే తమకు అదనంగా వచ్చే వాటాకు లోబడే నాలుగు ఎత్తిపోతల పథకాలు నిర్మించుకుంటున్నామన్నది కర్నాటక వాదన. కృష్ణా బోర్టులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న వివాదాలకు తాజాగా కర్నాటక నిర్మించే ప్రాజెక్టులు కూడా తోడు కావడంతో బుధవారం జరుగనున్న బోర్డు సమావేశంలో తీసుకునే నిర్ణయాలు కీలకం కానున్నాయి.