జాతీయ వార్తలు

చికిత్సకు ముందే ఫీజు చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ఎలాంటి రోగమొచ్చినా ఆసుపత్రికి వెళ్తే చికిత్స కోసం ఎంత గుంజేస్తారోనన్న భయం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇక ఆ బెంగ లేదు. చేసే చికిత్సకు సంబంధించి ఎంత ఫీజు చెల్లించాల్సి ఉంటుందో సదరు వైద్యు లు ముందుగా రోగికి తెలియజేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది. చికిత్స తరువాత కాకుండా వైద్యం చేయటానికి ముందే ఈ ఫీజుల గురించి తెలియజేయాలని ఇలా చేయటం భారత వైద్యమండలి (వృత్తి నైతిక వర్తన) నిబంధనల్లో భాగమేనని స్పష్టం చేసింది. ప్రతి వైద్యుడు కూడా తన చాంబర్ లేదా ఆసుపత్రిలో చికిత్సకు చెల్లించాల్సిన ఫీజు వివరాలు, ఇతర చార్జీలను లిఖిత పూర్వకంగా తెలియజేయాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. వైద్య చికిత్స లేదా ఆపరేషన్‌కు ముందే ఈ వివరాలను రోగి కుటుంబానికి తెలియజేయాలని, ఇలా అందించి న సేవలు, అందుకు సంబంధించిన ఫీజులు నిర్ణీత ఫారంలో ఉండాల్సిందేనని ఆరోగ్య శాఖ సహాయమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్థే రాజ్యసభలో మంగళవారం లిఖితపూర్వకంగా తెలిపారు.