జాతీయ వార్తలు

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఫిబ్రవరి 7: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్, సుక్మా జిల్లాల్లో మావోయిస్టులు, పోలీసుల మధ్య మంగళవారం రెండు భారీ ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఒక ఎన్‌కౌంటర్‌లో 12మంది మావోయిస్టులు చనిపోయి ఉంటారని చెబుతున్నప్పటికీ, మృతదేహాలు లభ్యం కాలేదు. రెండు ఘటనల్లో పెద్దసంఖ్యలో మావోయిస్టులు తప్పించుకోగా, వారు లూఠీ చేసిన పేలుడు పదార్థాలు, తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నారాయణ్‌పూర్ జిల్లా ఆమ్‌బేడా అటవీ ప్రాంతంలో డిఆర్‌జీ బలగాలు మంగళవారం తెల్లవారుఝామున కూంబింగ్ నిర్వహిస్తుండగా సుమారు 50మంది మావోయిస్టులు ఆ ప్రాంతంలో తారసపడ్డారు. భద్రతా బలగాల రాకను గమనించిన మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఇరువర్గాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ప్రతిఘటించలేక మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు. ఈ ఘటనలో 12మంది మావోలు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. అయితే మృతదేహాలు మాత్రం లభ్యంకాలేదు. కాగా పెద్దసంఖ్యలో నక్సల్స్ తీవ్రంగా గాయపడ్డారని నారాయణ్‌పూర్ ఎస్పీ అభిషేక్ మీనా తెలిపారు. ఘటనా స్థలం నుంచి మావోయిస్టుల సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు సుక్మా జిల్లా బచేలీ ఎన్‌ఎండీసి (నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)పై మావోయిస్టులు దాడికి దిగారు. 5 వాహనాలకు నిప్పుపెట్టారు. అక్కడున్న పేలుడు పదార్థాలను లూఠీ చేసుకుని వెళ్లిపోయారు. సంఘటన వివరాలు తెలుసుకున్న 231 బెటాలియన్ సిఆర్పీఎఫ్ బలగాలు వెంబడించి కాల్పులు జరిపారు. రెండు వర్గాల మధ్య ఎదురుకాల్పుల నేపథ్యంలో వెనక్కితగ్గిన మావోలు, లూఠీ చేసి తీసుకెళ్తున్న పేలుడు పదార్థాలను వదిలి పరారయ్యారు. వాటిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

చిత్రాలు..ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బచేలిలో మావోలు తగలబెట్టిన వాహనాలు
* పోలీసులు స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు