జాతీయ వార్తలు

బీసీ రిజర్వేషన్లకు సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కల్పనకు సహకరించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం ఆధ్యక్షుడు ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాజీ ప్రధాని దేవెగౌడను కోరారు. మంగళవారం నాడు మాజీ ప్రధానిని కలిసిన అనంతరం ఆర్. కృష్ణయ్య విలేఖరులతో మాట్లాడారు. ఆంగ్లో- ఇండియన్లు చట్టసభలకు నామినేటెడ్ చేసిన విధంగా శాసనసభలకు, పార్లమెంట్‌లో అడగుపెట్టని అత్యంత వెనుకబడిన కులాలకు అవకాశం కల్పించాలని కోరారు. పార్లమెంట్‌లో 36 పార్టీలు ఉన్నాయని, ఒక్క పార్టీ కూడా బీసీల పక్షాన పోరాటం చేయడం లేదని తెలిపారు. అలాగే లోక్‌సభలో 93 మంది బిసి వర్గానికి చెందిన పార్లమెంట్ సభ్యులుగా ఉన్న ఏ ఒక్కరూ బీసీల పక్షాన నోరెత్తి మాట్లాడకపోవడం అన్యాయమని వెల్లడించారు.