జాతీయ వార్తలు

హైదరాబాద్ హైకోర్టు సిజెగా జస్టిస్ టి వైఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: దేశవ్యాప్తంగా తొమ్మిది హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సుప్రీం కోర్టు సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జె ఎస్ కేహర్ సారథ్యంలోని సుప్రీం కోర్టు బెంచ్ హైదరాబాద్ హైకోర్టు సహా తొమ్మిది హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సూచించింది. తాత్కాలిక న్యాయమూర్తులు కాకుండా పూర్తికాలపు న్యాయమూర్తులను నియమించాలన్న సూచనలో భాగంగానే సుప్రీం కోర్టు ఈ పేర్లను సూచించింది. వీటిని కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే అత్యధిక స్థాయిలో ఏక కాలంలో తొమ్మిది హైకోర్టులకు పూర్తికాలపు న్యాయమూర్తులు నియమితులవుతారు. అభిజ్ఞవర్గాల సమాచారం ప్రకారం హైదరాబాద్ హైకోర్టుకు జస్టిస్ టి.వైఫీ, మధ్యప్రదేశ్ హైకోర్టుకు జస్టిస్ హేమంత్ గుప్తా, త్రిపుర హైకోర్టుకు జస్టిస్ అభిలాషా కుమారి, జమ్ము కాశ్మీర్ హైకోర్టుకు జస్టిస్ బిడి అహ్మద్, రాజస్థాన్ హైకోర్టుకు జస్టిస్ ప్రదీప్ నందరాజోగ్, పాట్నా హైకోర్టుకు జస్టిస్ రాజేంద్ర మీనన్, మద్రాస్ హైకోర్టుకు జస్టిస్ హెచ్‌జి రమేశ్, ఛత్తీస్‌గఢ్ హైకోర్టుకు జస్టిస్ పివి రాధాకృష్ణన్, జార్ఖండ్ హైకోర్టుకు జస్టిస్ పికె మొహంతి పేర్లను సూచించినట్లు తెలుస్తోంది. వీరిలో జస్టిస్ టి వైఫి ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఆయన్ని హైదరాబాద్ హైకోర్టుకు బదిలీ చేయవచ్చునని తెలుస్తోంది.