జాతీయ వార్తలు

ప్రధాని అపాయింట్‌మెంట్ రద్దుకావడం బాధాకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో ఢిల్లీకి రావాలనుకున్న అఖిలపక్ష బృందానికి ఇచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అప్పాయింట్‌మెంట్‌ను రద్దు చేయటాన్ని లోక్‌సభలో టిఆర్‌ఎస్ పక్షం నాయకుడు జితేందర్ రెడ్డి, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తప్పుపట్టారు. ప్రధాని అప్పాయింట్‌మెంట్‌ను రద్దు చేయటంతోపాటు ఎన్‌డిఏ ప్రభుత్వం తెలంగాణ వ్యతిరేక వైఖరిని అనుసరిస్తున్నందుకు నిరసనగా తాము రెండు రోజులనుండి పార్లమెంటు సమావేశాలను బయ్‌కాట్ చేస్తున్నట్లు విలేఖరులకు చెప్పారు. అఖిలపక్షం సభ్యులను ఆహ్వానించటంతోపాటు ప్రయాణ ఏర్పాట్లు చేసిన తరువాత అప్పాయింట్‌మెంట్ రద్దు వార్త కావటం బాధాకరం, దురదృష్టకరమని ఇరువురు నాయకులు చెప్పారు. అమరావతి నుండి వచ్చిన రైతులను మోదీ మంగళవారం మధ్యాహ్నం పార్లమెంటు ఆవరణలో కలిశారు, దీన్ని తాము వ్యతిరేకించటం లేదు అయితే తమపట్ల కూడా ఇదేవిధంగా వ్యవహరించి ఉండాల్సిందని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగే చర్చలో పాల్గొనకపోవటం బాగుండదనే అభిప్రాయంతోనే తానొక్కడిని సోమవారం లోక్‌సభలో జరిగిన చర్చలో పాల్గొన్నట్లు జితేందర్ రెడ్డి చెప్పారు. తెలంగాణ అభివృద్ధికోసం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చేస్తున్న కృషికి కేంద్ర ప్రభుత్వం సహాయం అవసరమని భావించాం, ఆందుకే ఎన్‌డిఏ ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతు ఇస్తున్నామని వివరించారు. తెలంగాణకు కొత్త ఐపీఎస్ అధికారుల కేటాయింపు, గణతంత్ర దినోత్సవంకోసం శకటాల ఎంపిక, ఎయిమ్స్, ఐఐఎం కేటాయింపు వంటి అంశాల్లో కేంద్రం తీరు సరిగాలేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర రక్షణ శాఖ, ఆర్థిఖ శాఖ మంత్రులు హామీ ఇచ్చినా తెలంగాణ శకటాన్ని ఎంపిక చేయలేదని చెప్పారు. లోక్‌సభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించనున్నట్లు జితేందర్ రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తదితర బిజెపి నాయకులు ఎస్‌సి వర్గీకరణాన్ని సమర్థించారు, ఇప్పుడేమో తమకు పిఎం అప్పాయింట్‌మెంట్ లభించలేదని శ్రీహరి చెప్పారు. వెంకయ్యకు చిద్దశుద్ధి ఉంటే ఎస్‌సి వర్గీకరణానికి చట్టబద్ధత కల్పించాలని శ్రీహరి చెప్పారు. తెలంగాణలోని మాదిగ ఉప కులాలకు ఇచ్చిన హామీలను వెంకయ్య నిలబెట్టుకోవాలని వారు సూచించారు.