జాతీయ వార్తలు

ప్రగతి పరుగుకు దన్ను ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవానికి హాజరుకావాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆహ్వానించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్టప్రతి భవన్‌కువెళ్లి ప్రణబ్‌తో భేటీ అయ్యారు. సిఎం కెసిఆర్ వెంట ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు కె కేశవరావు, బి వినోద్‌కుమార్, సీతారాం నాయక్ ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఏర్పడిన తెలంగాణ గత రెండున్నరేళ్లలో సాధించిన ప్రగతిని కెసిఆర్ వివరించారు. కేంద్రంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ 19.5 శాతం అభివృద్ధి సాధించి ముందు వరుసలో ఉన్నదని వివరించారు. రాష్ట్రం వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధిని వివరిస్తూ, ఇకమీదట మరింత అభివృద్ధి సాధిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలావుంటే ఉస్మానియా వర్శిటీ శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు రాష్టప్రతి సానుకూలత చూపించారని లోక్‌సభలో టిఆర్‌ఎస్ పక్షం నాయకుడు జితేందర్ రెడ్డి చెప్పారు.
జవడేకర్‌తో సిఎం కెసిఆర్
ఉస్మానియా వర్శిటీ అభివృద్ధి ఉత్సవాల నిర్వహణకు 300 కోట్లు కేటాయించాలని సిఎం కెసిఆర్, కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జావడేకర్‌ను కోరారు. జావడేకర్‌తో సమావేశమైన కెసిఆర్, రాష్ట్రంలోని విద్యా సంబంధ పథకాలపై చర్చించారు. కెజివిబిలో టెన్త్ చదువుతున్న బాలికల ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందంటూ, పనె్నండవ తరగతి వరకు ఈ ఖర్చులను కేంద్రం భరించాలని కోరారు. కొత్తగా ఏర్పడిన 21 జిల్లాలకు జవహర్ నవోదయ పాఠశాలు, కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని సిఎం కోరారు. చదువుల తల్లి జాన సరస్వతి కొలువుతీరిన నిర్మల్ జిల్లాలో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు అవసరమైన భూమి సిద్ధంగా ఉన్నదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

చిత్రం..రాష్టప్రతి భవన్‌లో ప్రణబ్‌కు పుష్పగుచ్చం అందిస్తున్న సిఎం కెసిఆర్ తదితరులు