జాతీయ వార్తలు

శివసేన గూటికి హార్దిక్ పటేల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 7: పటిదార్ల రిజర్వేషన్లకోసం పోరాడిన ఉద్యమ నేత హార్దిక్ పటేల్ నేతృత్వంలో తమ పార్టీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ప్రకటించారు. మంగళవారం తన నివాసం మాతోశ్రీలో హార్దిక్ పటేల్‌తో చర్చలు జరిపిన అనంతరం థాకరే ఈ విషయం ప్రకటించారు. హర్దిక్ పటేల్ నేతృత్వంలో వచ్చే ఏడాది గుజరాత్‌లోని 182 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నట్లు థాకరే చెప్పారు. ఈ నెల 21న బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి) ఎన్నికలు జరగనున్న తరుణంలో హార్దిక్ పటేల్‌ను గుజరాత్‌కు పార్టీనేతగా ఎంపిక చేస్తూ శివసేన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ ఎన్నికల్లో పాతిక సంవత్సరాలుగా మిత్రపక్షాలుగా ఉండిన శివసేన, బిజెపిలు విడివిడిగా పోటీ చేస్తుండడం తెలిసిందే. గుజరాత్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో పటిదార్లకు, ఇతర ఒబిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ 23 ఏళ్ల హార్దిక్ పటేల్ గత ఏడాదిన్నరగా ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై దేశద్రోహం కేసు పెట్టడంతో గుజరాత్ హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంనుంచి బహిష్కరించగా, ఇటీవలే ఆ నిషేధం ముగిసి ఆయన తిరిగి రాష్ట్రానికి వచ్చారు.

ముంబయలో మంగళవారం విలేఖరులతో మాట్లాడుతున్న ఉద్ధవ్ థాక్రే.
చిత్రంలో పటిదార్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్