జాతీయ వార్తలు

యూపీలో వీస్తున్నది ఎస్పీ-కాంగ్రెస్ ప్రభంజనమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరట్, ఫిబ్రవరి 7: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, యుపి ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మరోసారి బిజెపి, బిఎస్పీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్‌లో బలంగా వీస్తున్న ‘ఎస్పీ-కాంగ్రెస్ తుపాను’ వారిని ఎగరగొట్టేస్తుందని అన్నారు. దేశంలో కంపెనీ రాజ్‌ను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని ఫినిష్ చేస్తుందని అన్నారు. యుపి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మీరట్‌లో జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో రాహుల్, అఖిలేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ శాంతి, మత సామరస్యానికి ప్రతీక అయిన యుపిలో విద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి బిజెపి ప్రయత్నిస్తోందని, తాము దాని ప్రయత్నాలను సాగనివ్వబోమన్నారు. ‘కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ చేతులు కలపడంతో ఈ కూటమి తుపాను రాష్ట్రాన్ని తాకింది. ఈ తుపానులో మోదీతోపాటుగా, బిజెపి, బిఎస్పీలు కొట్టుకుపోతాయి’ అని అన్నారు.
ఈ వారం ప్రారంభంలో అలీగఢ్‌లో జరిగిన ఓ ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ బిజెపి తుపానుకు భయపడి అఖిలేష్ యాదవ్ తన పదవిని నిలబెట్టుకోవడానికి దేని సాయమైనా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించడం తెలిసిందే. మోదీ వ్యాఖ్యలను అఖిలేష్ తిప్పి కొడుతూ, రాష్ట్రంలో ఏదయినా తుపాను ఉందంటే అది ఎస్పీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన తుపానే. ఒకవేళ ఏదయినా తుపాను ఉన్నా తుపానులో కూడా సైకిల్ (సమాజ్‌వాది పార్టీ గుర్తు)ను ఎలా తొక్కాలో మాకు తెలుసు’ అని అఖిలేశ్ అన్నారు.
కాగా, 1857లో మీరట్‌లో జరిగిన సిపాయి తిరుగుబాటును రాహుల్ గాంధీ ప్రస్తావిస్తూ, ‘మీరు బ్రిటిష్‌వాళ్లకు గుణపాఠం నేర్పారు, కంపెనీ రాజ్‌నుంచి దేశం విముక్తికోసం జనం అప్పుడు పోరాడితే ఇప్పుడు మోదీ దేశంలో మరో కంపెనీ రాజ్‌ను తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు’ అని అన్నారు. ప్రధాని కొన్ని కంపెనీలకే మేలు చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో శ్రీమంతులైన 50 కుటుంబాలు బకాయిపడిన 1.10 లక్షల కోట్లను ఆయన మాఫీ చేశారని, అయితే పేదవాళ్లకు మాత్రం ఒక్కపైసా కూడా ఇవ్వలేదన్నారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి హామీ ఇచ్చినట్లుగా మీ ఖాతాల్లో 15 లక్షలు డిపాజిట్ చేశారా, యువకులకు ఉపాధి కల్పించారా?’ అని ఆయన సభకు హాజరైన వారిని ప్రశ్నించారు.

చిత్రం..మీరట్‌లో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్, అఖిలేశ్