జాతీయ వార్తలు

చిన్నమ్మే సిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 7: ‘చిన్నమ్మ తమిళనాడు ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ ఆపలేరు’ అని అన్నాడిఎంకె సీనియర్ నేతలు పి రామచంద్రన్, కెఏ సెంగొట్టియన్ ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి వెనుక కుట్ర ఉందని తమిళనాడు అసెంబ్లీ మాజీ స్పీకర్, పార్టీ సీనియర్ నేత పిహెచ్ పాండియన్ మంగళవారం ఆరోపించిన కొద్ది గంటలకే వారు మీడియా సమావేశంలో ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించడమే కాకుండా శశికళా నటరాజన్ ముఖ్యమంత్రి అయి తీరుతారని ప్రకటించడం గమనార్హం.
‘శశికళను తమ నాయకురాలిగా ఎన్నుకోవాలని అన్నాడింకె ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా నిర్ణయించారు. మేము మా నిర్ణయాన్ని గవర్నర్‌కు తెలియజేశాం. ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేయాలో గవర్నర్ తెలియజేయలేదన్న కారణంగా ప్రమాణస్వీకారం ఆలస్యం అవుతుందని చెప్పడం సరికాదు. ఇది గవర్నర్‌కు, అన్నాడిఎంకెకు మధ్య వీలుకు సంబంధించిన అంశం. మా వైఖరిని గవర్నర్‌కు తెలియజేశాం. తనకు అనుకూలమైన సమయం ఏదో చెప్పాల్సింది గవర్నరే. ఆయనను మేము ఒత్తిడి చేయలేం’ అని అన్నాడిఎంకె ఎమ్మెల్యే కూడా అయిన రామచంద్రన్ చెప్పారు. జయలలిత మరణం తర్వాత కూడా అన్నాడిఎంకె కలిసికట్టుగానే ఉందని, కార్యకర్తలు కూడా ప్రశాంతంగా ఉన్నారని ఆయన అన్నారు.
కాగా మరో సీనియర్ నేత సెంగొట్టియన్ మరో అడుగు ముందుకు వేసి ‘చిన్నమ్మ తమిళనాడు సిఎం కాకుండా ఎవరూ ఆపలేరు’ అని అన్నారు. కొంతమంది నేతలు ప్రస్తుత పరిస్థితిని సాకుగా తీసుకొని కార్యకర్తల్లో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. పాండియన్ చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ, ఆయన ఏదయినా చెప్పాలనుకుంటే పార్టీ వేదికల్లో చెప్పి ఉండాల్సిందని అన్నారు. పాండియన్ ఆరోపణలు వాస్తవం కాదని, వాటిని తాము తిరస్కరిస్తున్నామని చెప్పారు. పాండియన్ కుటుంబ సభ్యులు అయిదుగురు పదవులు అనుభవించారని, ఇప్పుడు వారు పార్టీ శత్రువులతో చేతులు కలుపుతున్నారని సెంగొట్టియన్ అన్నారు.