జాతీయ వార్తలు

జయను ఇంట్లో తోసేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 7: దివంగత అన్నాడిఎంకె నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై అనుమానాలు ఉన్నాయని ఆ పార్టీ సీనియర్ నేత పిహెచ్ పాండియన్ ఆరోపించారు. పొయెస్ గార్డెన్‌లో ఉన్న సమయంలోనే ఆమెను ముందుకు తోశారని దాంతో ఆమె కుప్పకూలిపోయారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయని ఆయన అన్నారు. జయ స్నేహితురాలు శశికళ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించటాన్నీ ఆయన తప్పుపట్టారు. తమిళనాడు అసెంబ్లీ మాజీ స్పీకర్‌గా పనిచేసిన పాండియన్, జయ మరణం అసహజమన్నారు. ఆమెను ఆసుపత్రిలో చేర్పించిన నాటి నుంచి కన్నుమూసే వరకు 75రోజుల్లో ఏం జరిగిందో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తన కుమారుడు మనోజ్‌తో కలిసి మంగళవారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ ఆరోపణలు చేశారు. ‘సెప్టెంబర్ 22 రాత్రి జయ ఇంట్లో మాటల యుద్ధం జరిగింది. మరోవ్యక్తి (శశికళ) కుటుంబానికి సంబంధించిన వ్యవహారంపై వివాదం రేగింది. ఆ వాదులాట చినికిచినికి గాలివానగా మారి జయను తోసివేయటం జరిగింది. అంతే ఆమె స్పృహ కోల్పోయారు. అక్కడినుంచి ఆసుపత్రికి తరలించారు. ఇదంతా తెల్లవారి పేపర్లలో వార్తగా కూడా వచ్చింది’ అని పాండియన్ వివరించారు. జయలలితకు అందించిన వైద్యం గురించి, ఆసుపత్రిలో ఆమె పరిస్థితి గురించి ఎందుకంత రహస్యంగా ఉంచాల్సివచ్చిందో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జయలలిత మరణంపై ఇంతకాలం వౌనంగా ఉన్నప్పటికీ, గతకొద్ది రోజులుగా తమిళ రాజకీయాల్లో అనూహ్యంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తనను కలచివేశాయని అందుకే ఇప్పుడు మాట్లాడాల్సి వస్తోందని పాండియన్ వివరించారు. శశికళకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదని ఆయన అన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టడం కూడా నిబంధనలకు వ్యతిరేకమేనని ఆయన వ్యాఖ్యానించారు. కార్యకర్తలు మాత్రమే పార్టీ ప్రధానకార్యదర్శిని ఎన్నుకోగలరని ఆయన అన్నారు. జయలలిత చనిపోయిన 20రోజుల వ్యవధిలోనే పార్టీ నేతలు శశికళను పార్టీ చీఫ్‌గా ఉండాలని కోరుకునేలా చేశారని ఆయన విమర్శించారు.