జాతీయ వార్తలు

మూడు వారాల్లోగా బదులివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలపై మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని రెండు తెలుగు రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని పాఠశాలల్లో వౌలిక సదుపాయాల లేమిపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను గురువారం జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ భానుమతిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఉపాధ్యాయుల నియామకాలపై తెలంగాణ దాఖలు చేసిన అఫిడవిట్‌పై అసంతృప్తిని ధర్మాసనం వ్యక్తం చేసింది. అలాగే విద్యాహక్కు చట్టం సరిగ్గా అమలు అయ్యేలా చూసే బాధ్యత ప్రభుత్వాలదేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పాఠశాలంటే కేవలం భవనాలు ఒక్కటే కాదని, నాణ్యమైన విద్యను అందించాలని తెలు గు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సూచించింది. పిటిషనర్ తరపున న్యాయవాది శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో 25 వేలు, తెలంగాణలో 16వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణలో ఉపాధ్యా య నియామకాలపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది పాల్వాయి వెంకట్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ రాజ్యాంగంలోని 371(డి) వల్ల ఉపాధ్యాయ నియామకాలు చేయలేకపోతున్నామని ధర్మాసనానికి తెలిపారు. ఈ సందర్భంలో ఉపాధ్యాయ నియామకాలపై సందిగ్ధతను తొలగించేందుకు రాజ్యాంగంలోని 371(డి)కి సంబంధించి అటార్నీ జనరల్ సహాయం తీసుకోవాలని ధర్మాసనం నిర్ణయించింది. మరోవైపు ఏపీలో పాఠశాలల్లోని టాయిలెట్లలో నీటి సౌకర్యలపై ఏపీ ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.
పాఠశాలల్లోని టాయిలెట్లలో నీటి సౌకర్యం లేకపోవడం వల్ల బాలికలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీంతో ఏపీలోని పాఠశాలల్లో నీటి సౌకర్యం కల్పిస్తున్నట్టు ఏపీ తరపు న్యాయవాది గుంటూరు ప్రభాకర్ కోర్టుకు తెలిపారు.