జాతీయ వార్తలు

మోదీ వ్యాఖ్యలపై వేడెక్కిన రాజ్యసభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: బడ్జెట్ సమావేశాలలో మొదటి దశ చివరిరోజున గురువారం రాజ్యసభలో చెలరేగిన తీవ్ర గందరగోళ పరిస్థితుల్లో రెండుసార్లు సభ వాయిదా పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం మాజీ ప్రధానిపై చేసిన రెయిన్‌కోట్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే అన్నాడిఎంకె ఎంపీలు తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో పోడియం వద్దకు వచ్చి ఆందోళన చేశారు. ఉదయం రాజ్యసభ ప్రారంభమైన వెంటనే అన్నా డిఎంకె ఎంపీలు తమిళనాడు పరిస్థితులపై రాజ్యసభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని పోడియం వద్దకు వచ్చి డిప్యూటీ చైర్మన్ కురియాన్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో డిప్యూటీ చైర్మన్ అన్నాడిఎంకె ఎంపీలకు సభలో మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని ముందుగా రాజ్యసభ కార్యకలాపాలు జరిగేందుకు సహకరించాలని కోరడంతో అన్నాడిఎంకె ఎంపీలు వెనక్కి తగ్గారు. అనంతరం బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం సందర్భంగా సీపీఎం నాయకులపై చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ సీతారాం ఏచూరి అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఎంపీ అనంద్ శర్మ డిమాండ్ చేశారు. మాజీ ప్రధానిని అవమానించేలా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. ఈ గందరగోళం మధ్యలో అన్నాడిఎంకె ఎంపీలు రాజ్యసభ పోడియం వద్దకు దుసుకొచ్చారు. అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళకు అనుకూలంగా తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ జాప్యం చేస్తున్నారంటూ నినాదాలు చేయడంతో సభకు అంతరాయం కలిగింది. మరోవైపు కాంగ్రెస్ సభ్యలు కూడా ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చేప్పాలని డిమాండ్ చేస్తూ వెల్‌లోకి రావడంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. దీంతో డిప్యూటీ చైర్మన్ మధ్యాహ్నం 12 గంటలకు వరకు సభను వాయిదా వేశారు. అనంతరం 12 గంటలకు ప్రారంభమైన రాజ్యసభలో కాంగ్రెస్, అన్నాడిఎంకె ఎంపీలు వెల్‌లోకి వచ్చి నినాదాలు కొనసాగించారు. అయితే చైర్మన్ హమీద్ అన్సారీ సభలో ప్రశ్నోత్తరాలను కొనసాగించేందుకు సహకరించాలని విపక్షా సభ్యులకు విజ్ఞప్తి చేశారు. అయినా కూడా విపక్షా సభ్యులు సభకు అంతరాయం కలిగించడంతో సభను మళ్లీ వాయిదా వేశారు.

చిత్రం..రాజ్యసభలో గురువారం గొడవ చేస్తున్న విపక్ష సభ్యులు