జాతీయ వార్తలు

పిఎస్‌ఎల్‌వి-సి రాకెట్ అనుసంధానం పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఏప్రిల్ 21: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగానికి శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుండి ఈనెల 28న పిఎస్‌ఎల్‌వి-సి 33 రాకెట్ ద్వారా 1425 కిలోల బరువు గల ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జి ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే రాకెట్ మూడు దశల అనుసంధాన పనులతో పాటు రాకెట్‌లోని చివరి భాగంలో ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియను కూడా శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు.
గురువారం ఉపగ్రహానికి శాస్తవ్రేత్తలు తుది పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం ఉపగ్రహం చుట్టు ఉష్ణకవచాన్ని అమర్చనున్నారు. ఈనెల 25న రాకెట్ చివరి మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్) డాక్టర్ బిఎన్ సురేశ్ అధ్యక్షతన నిర్వహించనున్నారు. ఎంఆర్‌ఆర్ అనంతరం అదేరోజు షార్ డైరెక్టర్ పి.కున్హికృష్ణన్ అధ్యక్షతన లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు (ఎల్‌ఎబి) సమావేశమై సుదీర్ఘంగా చర్చించినంతరం ప్రయోగానికి సంసిద్ధత తెలపనున్నారు. ప్రయోగానికి 48 లేదా 52 గంటల ముందు అనగా ఈనెల 26న కౌంట్‌డౌన్ ప్రారంభించనున్నారు.
అన్నీ సజావుగా సాగి వాతావరణం అనుకూలిస్తే ఈనెల 28న 12:59 గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి 33 రాకెట్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుండి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లనుంది. నావిగేషన్ సిరీస్‌లో ఇది చివరి ప్రయోగం కావడం విశేషం. ఇదివరకు ఆరు ప్రయోగాలను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది.

chitram ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జి ఉపగ్రహ