జాతీయ వార్తలు

పోరాడితేనే ఎయిమ్స్ వచ్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: తెలంగాణ ఆవిర్భావం అనంతరం కూడా రాష్ట్రానికి రావాల్సిన అంశాలపై పోరాడి సాధించుకోవాల్సి వస్తోందని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత జితేందర్ రెడ్డి అన్నారు. పోరాటం చేస్తే తప్ప రాష్ట్రానికి ఏమీ దక్కడంలేదని, ఇప్పుడు అలాగే పోరాటం చేసి ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (ఎయిమ్స్)ను సాధించుకున్నామని అని ఆయన వెల్లడించారు. ఢిల్లీలో టీఆర్‌ఎస్ ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్‌కుమార్‌లు విలేఖరులతో గురువారం మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యులు చేసిన ఆందోళనలకు కేంద్రం దిగివచ్చిందని జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
తాము చేసిన ఆందోళనలతోనే కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ తెలంగాణకు ఎయిమ్స్‌ను ప్రకటించారని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీకి కృతజ్ఞతలు తెలిపారు. విభజన చట్టంలోని తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అంశాలపై గతం రెండున్నర ఏళ్లుగా కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు. ఎయిమ్స్, రైల్వే బడ్జెట్‌లో అధిక నిధులు సాధించినట్లే రాష్ట్రానికి రావాల్సిన ప్రతి అంశాన్ని సాధించేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ బడ్జెట్‌లో ఎయిమ్స్ ప్రకటిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హామీ ఇచ్చి, దానిని నిలుపుకోలేదని ఆరోపించారు.