జాతీయ వార్తలు

ఇంజనీరింగ్‌కు ఒకే ఎంట్రన్స్ టెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ఇంజనీరింగ్ కాలేజిల్లో అడ్మిషన్ల కోసం ఇకపై విద్యార్థులు ఒక ప్రవేశ పరీక్ష రాస్తే సరిపోతుంది. అడ్మిషన్ల కోసం కేంద్ర ప్రభుత్వ ఏజన్సీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ ఏజన్సీలు నిర్వహించే వివిధ పరీక్షలు రాసే బదులు వచ్చే సంవత్సరంనుంచి ఒకే ఎంట్రన్స్ పరీక్ష రాసేలా చర్యలు తీసుకొన్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఆర్కిటెక్చర్ కోర్సులతో సహా అన్నీ ‘నీట్’ తరహాలో నిర్వహించే ఎంట్రన్స్ పరీక్షపైనే ఆధారపడి ఉంటాయి. అయితే ఐఐటిలలో చేరాలనుకునే విద్యార్థులు మాత్రం ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్ష రాసిన తర్వాత జెఇఇ అడ్వాన్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసిటిఇ) చేసిన ఈ ప్రతిపాదనకు మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలియజేసింది. అయితే ఒకే పరీక్షా విధానం అమలు చేయడానికి నాణ్యమైన టెస్టింగ్ విధానం ఉండాలని మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఏఐసిటిఇకి సూచించింది. దీనికి అనుగుణంగా తగిన నిబంధనలను జారీ చేయాలని కూడా పేర్కొంది. చదువు విషయంలో ఎలాంటి అవినీతికి, వ్యాపార ధోరణులకు తావు లేకుండా మరింత పారదర్శకంగా ఉండేలా చూడాలన్నదే ఈ నిర్ణయం లక్ష్యం అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
భారత్‌లో విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా మొత్తం 3,300 ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. వీటిలో 16 లక్షలకు పైగా సీట్లు ఉండగా వాటిలో సగం సీట్లు మాత్రమే ఇప్పుడు భర్తీ అవుతున్నాయి. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ స్థాయిలో అడ్మిషన్ల ప్రక్రియ వివిధ ఏజన్సీలు నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో విద్యార్థి ప్రదర్శనను బట్టి ఉంటోంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థల్లో అడ్మిషన్ల కోసం సిబిఎస్‌ఇ జెఈఈ-మెయిన్ పరీక్ష నిర్వహిస్తోంది. ఏటా 13 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాస్తున్నారు. పలు రాష్ట్రాలు సొంతంగా ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహిస్తూ ఉంటే కొన్ని రాష్ట్రాలు మాత్రం ఇంటర్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు సొంతంగా ఎంట్రన్స్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అయితే ఇంజనీరింగ్ కాలేజిలు డబ్బులకు సీట్లను అమ్ముకొంటూ ఉండడంతో విద్యా ప్రమాణాలు పడి పోయి సగానికి సగం ఇంజనీరింగ్ పట్ట్భద్రులు నిరుద్యోగులుగా మిగిలి పోతూ ఉండడం ప్రభుత్వానికి సైతం ఆందోళన కలిగిస్తోంది. దీనికి చెక్ పెట్టేందుకే దేశవ్యాప్తంగా ఒకే ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది.