జాతీయ వార్తలు

ఉత్తరాఖండ్‌లో పోలింగ్ బహిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆల్మొరా, ఫిబ్రవరి 10: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఈనెల 15న జరిగే ఎన్నికలను బహిష్కరించాలని ఆర్మొరా నిజయోకవర్గంలోని సోమేశ్వర్‌లో గోడరాతలు కనిపించాయి. గోడ రాతలు, పోస్టర్లు, బ్యానర్లు నియోజక ప్రాంతంలో పలుచోట్ల కనిపించాయని సీనియర్ సూపరింటిండెంట్ దిలీప్ సింగ్ కన్వార్ వెల్లడించారు. మహాత్మాగాంధీ ఇంటర్ కాలేజీ, ఛౌండా గ్రామం, కాళికాదేవీ ఆలయం గోడలపై ఎన్నికలను బహిష్కరించాలంటూ ఎర్ర రంగుతో మావోయిస్టులు నినాదాలు రాశారు. ఛౌండా గ్రామంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. కరపత్రాలు కూడా కనిపించాయని ఆయన అన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని బ్యానర్లు, పోస్టరు తొలగించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుమన్న ఎస్‌పి అదనంగా సాయుధ బలగాలు మోహరించి, నిఘా కట్టుదిట్టం చేశారు. ఈనెల 2న నైనిటాల్ జిల్లా ధారి ప్రాంతంలో కనిపించిన మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపాయి.