జాతీయ వార్తలు

ఆ ఎమ్మెల్యేని వదలిపెట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రడూన్, ఏప్రిల్ 21: పోలీసు అశ్వం ‘శక్తిమాన్’ మరణానికి కారణమైన బిజెపి ఎమ్మెల్యే గణేష్ జోషీని వదిలేదని లేదని డెహ్రడూన్ ఎస్‌ఎస్‌పి సదానంద్ డేట్ వెల్లడించారు. ఎమ్మెల్యేపై కేసు కొననాగుతుందని గురువారం ఇక్కడ స్పష్టం చేశారు. మార్చి 14న బిజెపి చేట్టిన నిరసన కార్యక్రమం సందర్భంగా పోలీసు గుర్రం శక్తిమాన్ కాలుపై ఎమ్మెల్యే విచక్షణారహితంగా దాడి చేశారు. 13 ఏళ్ల నుంచి పోలీసులకు సేవలిందిస్తున్న శక్తిమాన్ వెనకవైపుకుడి కాలు పూర్తిగా దెబ్బదింది. వైద్యు లు శస్తచ్రికిత్స చేసి కృత్రిమ కాలు అమర్చినా కోలుకోలేదు. బిజెపి ఎమ్మెల్యే చర్య సామాజిక మాద్యమాల్లో చూసిన జనం పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. కాగా ఐపిసి 429 కింద జోషీని అరెస్టు చేశారు. తరువాత బెయిల్‌పై విడుదలయ్యారు. శక్తిమాన్ మృతికి సంతాపం తెలిపిన ఎమ్మెల్యే తాను మాత్రం అమాయకుడినని చెప్పుకున్నారు.

చిత్రం ‘శక్తిమాన్’కు నివాళులర్పిస్తున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్‌రావత్