జాతీయ వార్తలు

నేడు ముంబయికి స్థూలకాయురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 10: ఈజిప్టుకు చెందిన 500 కిలోల బరువు గల ఎమన్ అహ్మద్ అనే మహిళ బరువు తగ్గించుకునే చికిత్సను పొందడానికి శనివారం ఇక్కడకు రానుంది. 36 ఏళ్ల వయసు గల ఈ మహిళ అధిక బరువు వల్ల గత 25 సంవత్సరాలుగా తన ఇంటి నుంచి బయటకు కదలలేదు. ప్రపంచంలోని అత్యంత బరువు గల మహిళల్లో ఒకరయిన ఎమన్ అహ్మద్ ప్రస్తుతం ముంబయిలోని బేరియాట్రిక్ సర్జన్ ముఫజల్ లక్డావాలా, అతని బృందం పర్యవేక్షణలో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధిక బరువు వల్ల మంచానికే పరిమితమైన ఎమన్‌కు సుమారు మూడు నెలలుగా లక్డావాలా, అతని బృందం చికిత్స అందిస్తోంది. ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరానికి చెందిన ఎమన్‌ను ముంబయికి తీసుకు రావడానికి అవసరమైన ముందు జాగ్రత్తలన్నింటిని ఈ వైద్య బృందం తీసుకున్నట్టు లక్డావాలా సహాయకుడు ఒకరు చెప్పారు. గత 25 ఏళ్లుగా ఇంటి నుంచి బయటకు కూడా వెళ్లలేని ఈ మహిళను ఇక్కడికి సురక్షితంగా తీసుకు రావడమే ఒక సవాలుతో కూడిన పనని పేర్కొన్నారు. ఈజిప్టు ఎయిర్ విమానయాన సంస్థకు చెందిన విమానంలో ఎమన్ ఇక్కడికి వస్తున్నారు. ముంబయిలోని సైఫీ హాస్పిటల్‌లో బేరియాట్రిక్ సర్జరీ డిపార్ట్‌మెంట్ అధిపతి, సెంటర్ ఆఫ్ ఒబెసిటి అండ్ డైజెస్టివ్ సర్జరీలో అడ్వాన్స్‌డ్ లాపరోస్కోపిక్, బారియాట్రిక్ సర్జన్ అపర్ణ గోవిల్ భాస్కర్, క్రిటికల్ అండ్ ఇంటెన్సివ్ కేర్ డిపార్ట్‌మెంట్‌లో సీనియర్ ఇంటెన్సివిస్ట్ కమలేశ్ బోహ్రా ఆమెతో పాటు విమానంలో వస్తున్నారు. ఎమన్‌తో పాటు ఆమె సోదరి షైమా అహ్మద్ కూడా వస్తున్నారు. శనివారం తెల్లవారు జామున నాలుగు గంటలకు ఈ విమానం ఇక్కడికి చేరుకుంటుంది. విమాన యానానికి ఆరోగ్య పరంగా ఆమెను సిద్ధం చేయడానికి వైద్యుల బృందం గత పది రోజులుగా ఈజిప్టులో ఉండి అన్ని ఏర్పాట్లు చేసింది. విమానయానం వల్ల ఆమె ప్రాణాలకు పొంచి ఉన్న ప్రమాదాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడానికి ఈ వైద్య బృందం చర్యలు తీసుకుంది. ఈజిప్టు ఎయిర్ విమానంలో ఆమెకోసం ప్రత్యేకంగా ఒక పడకను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే చికిత్స చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు, ఔషధాలు విమానంలో ఉన్నాయి. విమానం దిగిన తరువాత ఆమెను ఒక ట్రక్కులో సైఫీ హాస్పిటల్‌కు తరలిస్తారు. ఈ ట్రక్కు వెంట ఒక అంబులెన్స్, పోలీస్ ఎస్కార్ట్ ఉంటాయి. సైఫీ హాస్పిటల్‌లో ఎమన్ కోసం ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేశారు.

చిత్రం..500 కిలోల బరువు గల ఈజిప్టుకు చెందిన మహిళ ఎమన్ అహ్మద్