జాతీయ వార్తలు

రాజకీయాల్లోకి రజనీకాంత్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 10: తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు పుకార్లకు, ఊహాగానాలకు కొదవ లేకుండా పోయింది. ఓ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాత్కాలిక ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వమా, అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళనా అనే విషయంలో రాష్ట్ర ప్రజలు ఎటూ తేల్చుకోలేక పోతూ ఉంటే మరోవైపు సూపర్‌స్టార్ రజనీకాంత్ త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ కథనాలు ఇప్పుడు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త ఎస్ గురుమూర్తి కొత్త పార్టీ పెట్టాలని ఆయనకు సలహా ఇచ్చారని కూడా చెబుతున్నారు. రజనీకాంత్‌కు ఉన్న ప్రజాదరణను ఆధారం చేసుకుని తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు బిజెపి వేసిన కొత్త ఎత్తు ఇదని కూడా ఆ కథనాలు పేర్కొంటున్నాయి. దీర్ఘకాలంలో రజనీకాంతే రాష్ట్రంలో బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారని కూడా ఆ కథనాలు పేర్కొన్నాయి. అయితే గురుమూర్తి ఈ వార్తలను ఖండించారు.
ఇదిలా ఉండగా పార్టీ పెట్టి క్రియాశీల రాజకీయాల్లోకి రావొద్దని రజనీకాంత్‌కు బాలీవుడ్ సూపర్‌స్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ సలహా ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. 1980 దశకంలో అమితాబ్ ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ నియోజకవర్గంనుంచి కాణగ్రెస్ టికెట్‌పై లోక్‌సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అమితాబ్, రజనీకాంత్ ఇద్దరూ మంచి స్నేహితులే కాక హమ్, గిరఫ్తార్, అంధా కానూన్‌లాంటి పలు సినిమాల్లో కలిసి నటించారు కూడా.