జాతీయ వార్తలు

మమ్మల్ని ఎవరూ నిర్బంధించలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 10: అన్నాడిఎంకె పార్టీ ఎమ్మెల్యేలను శశికళ వర్గం ఒక రిసార్ట్‌లో అక్రమంగా నిర్బంధించారం టూ తాత్కాలిక ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం చేసిన ఆరోపణలను ఆ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు శుక్రవారం ఖండించారు. ఎమ్మెల్యేలను నగర శివార్లలోని ఒక రిసార్ట్‌లో అక్రమంగా నిర్బంధించారని, వారు ఫోన్లలో కూడా అందుబాటులో లేరని పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన విసి అరుకుట్టి అనే ఎమ్మెల్యే ఆరోపించిన విషయం తెలిసిందే.
అయితే తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, శశికళకు మద్దతు ఇచ్చేందుకే తామంతా బయటికి వచ్చి ఒక చోట సమావేశమైనామని శశికళ వర్గానికి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు చెప్పారు. కిడ్నాప్ చేయడానికి తామే మీ చిన్న పిల్లలం కాదని, తమ ఇష్టప్రకారమే తామంతా ఇక్కడ ఉన్నామని, నగర శివార్లలోని ఓ బీచ్ రిసార్ట్‌కు సమీపంలో విలేఖరులతో మా ట్లాడుతూ వారు చెప్పారు. ఈ మేరకు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని పెరుందురై ఎమ్మెల్యే ఎన్‌డి వెంకటాచలం చెప్పారు. ఒక వేళ గవర్నర్‌నుంచి పిలుపు వస్తే తక్షణం వెళ్లడానికి వీలుగాతనలాంటి మాజీ మంత్రులతో సహా కొంతమంది ఎమ్మెల్యేలు ఒకే చోట ఉంటున్నామని ఆయన చెప్పా రు. కాగా, తన ఇష్టప్రకారమే రిసార్ట్‌లో ఉంటున్నానని, అందుకు అయ్యే ఖర్చును తానే చెల్లిస్తున్నానని ఎన్ మురుగుమారన్ అనే మరో ఎమ్మెల్యే చెప్పారు. ‘బెదిరింపులు, కిడ్నాప్‌లు, ఒత్తిళ్లు.. ఏవీ లేవు. అవన్నీ కల్పితగాథలే’ అని ఆయన అన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు రిసార్ట్‌లో ఉంటే మరికొంతమంది తమకు ఇష్టమైన చోట్ల ఉంటున్నారని కూడా ఆయన చెప్పారు. అంతేకాదు అనవసరమైన ఫోన్‌కాల్స్‌నుంచి తప్పించుకోవడం కోసమే ఫోన్లు స్విచాఫ్ చేసుకున్నామని వారు చెప్పారు. పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన వారు తమను బెదిరిస్తున్నారని కూడా వారు ఆరోపించారు.

మద్దతుదారులతో శశికళ (ఫైల్ ఫొటో)