జాతీయ వార్తలు

నేడు పాక్షిక చంద్రగ్రహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, ఫిబ్రవరి 10: ఈ ఏడాదిలో తొలి పాక్షిక చంద్ర గ్రహణం శనివారం కనిపించబోతోంది. తెల్లవారుజామున 4 గంటల రెండు నిమిషాల రెండు సెకన్లకు మొదలయ్యే ఈ గ్రహణం 8.25 నిమిషాల ఐదు సెకన్ల వరకు కొనసాగుతుంది. ఇది భారత్‌లో ప్రస్ఫుటంగా కనిపిస్తుందని, ఇక్కడి జివాజి పరిశోధక కేంద్రం సూపరింటెండెంట్ రాజేంద్రప్రకాష్ గుప్త్ తెలిపారు. ఈ గ్రహణ సమయంలో చంద్రుడి కాంతి క్రమంగా సన్నగిల్లుతుందని వెల్లడించారు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే వరుసకు వచ్చినప్పుడు ఈ రకమైన చంద్ర గ్రహణం సంభవిస్తుందన్నారు. సూర్యుడి కాంతి నేరుగా చంద్రుడి ఉపరితలంపై పడకుండా భూమి అడ్డుగా వస్తుందని, భూమి నీడ కొంత భాగం చంద్రుడిపై పడుతుందని వెల్లడించారు. దీన్ని ప్రతిబింబ చంద్రగ్రహణంగా పేర్కొంటారని గుప్త్ వెల్లడించారు.