జాతీయ వార్తలు

జీతాలు ఇవ్వకుంటే యాజమాన్యాలకు జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: జీతాలు ఇవ్వకున్నా, తక్కువ ఇచ్చినా యాజమాన్యాలను జైలుకు పంపించేందుకు వీలు కల్పిస్తూ దేశ వ్యాప్తంగా కొత్త కార్మిక చట్టం అమలులోకి తెచ్చినట్టు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. కార్మికులకు ఉద్యోగ, వేతన, సామాజిక భద్రత కల్పించేందుకు వీలు కల్పించే మూడు బిల్లులు పార్లమెంటు ఆమోదం పొందాయని ఆయన చెప్పారు. దొంగ జీతాలకు చెల్లు చీటి పలుకుతామని, ఖచ్చితంగా కనీస వేతనాలు చెల్లించాల్సి ఉంటుందని, ఇక యాజమాన్యాలు ఇష్టా రాజ్యంగా ఉద్యోగులను తొలగించేందుకు వీలుండదని, తప్పించుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా చట్టంలో నిబంధనలు అమలులోకి తెచ్చామని పేర్కొన్నారు. కార్మిక బిల్లులు ఏకగ్రీవంగా అన్ని పార్టీలు సమర్ధించి ఆమోదించాయని, రాజ్యసభలో సైతం కాంగ్రెస్, వామపక్షాలు స్వాగతించి మూడు బిల్లులను ఆమోదించారని అది గొప్ప విజయమని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. శుక్రవారం నాడు ఆయనకు పార్టీ కార్యాలయంలో జరిగిన సన్మానానికి బదులిచ్చారు. కార్మిక శాఖలో సమూల మార్పుల కోసం ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో విస్తృతంగా చర్చలు జరిపామని , దానికి ఆయన ఇచ్చిన మద్దతు ఎంతో విశిష్టమైనదని అన్నారు. బోనస్ చట్టం, బాల కార్మికుల చట్టం, కనీస వేతన చట్టం బిల్లులు ఆమోదం పొందాయని ఇది కార్మిక విజయమని అన్నారు. సిఐటియుసి, ఎఐటియుసి వంటి 12 జాతీయ సంఘాలను ఏకత్రాటిపైకి తెచ్చి, వారికి వివరించి ఈ చట్టాలను తీసుకువచ్చామని పేర్కొన్నారు. కార్మికులు అందరికీ ఉద్యోగ భద్రత,వేతన భద్రత, వేతన భద్రత కల్పించడమే తమ ఉద్ధేశ్యమని అన్నారు. వేతనాలు తక్కువగా ఇచ్చి, రికార్డుల్లో ఎక్కువ చూపించడం, నెలల తరబడి చెల్లించకపోవడం వంటివి ఇక కుదరదని, పేమెంట్ ఆఫ్ వేజెస్ చట్టం ప్రకారం ప్రతి నెల మొదటివారంలోనే చెల్లించాల్సి ఉంటుందని, ఒక వేళ ఎవరైనా ఉల్లంఘిస్తే ఆరు నెలల జైలు శిక్ష పడుతుందని, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పేరుతో ఎవరినైనా ఉద్యోగం నుండి తొలగిస్తే ఆయా యాజమాన్యాలకు 9 నెలల పాటు జైలు శిక్ష విధించేలా నిబంధనలు చేర్చామని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి పేరుతో 12 శాతం మేర ప్రావిడెంట్ ఫండ్ చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ఉద్యోగులకు బ్యాంకు అకౌంట్ తెరవగానే అదే పెద్ద ఆధారంగా ఉంటుందని ఇక మీదట యాజమాన్యాలు తప్పించుకునే అవకాశం లేదని పేర్కొన్నారు. పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ప్రకారం పూర్తి వేతనం ఇవ్వాల్సి ఉంటుందని, దీనిపై 1965 నుండి తర్జనభర్జన జరుగుతుందే తప్ప అమలులోకి రాలేదని, ఇన్నాళ్లకు దానిని అమలులోకి తెచ్చామని పేర్కొన్నారు. యాజమాన్యాలు తప్పించుకోవడానికి వీలు లేదని, పటిష్టమైన నిబంధనలను చట్టంలో చేర్చామని వివరించారు. ట్రేడ్ యూనియన్లు బలంగా ఉండాలని, ఆ యూనియన్లు కార్మికుల సంక్షేమమే లక్ష్యం కావాలని చెప్పారు. గతంలో ఇఎస్‌ఐ 15వేల లోపు వేతనం ఉన్నవారికే అమలులో ఉండేదని ఇపుడు దానిని 21వేల వేతనం ఉన్నవారికి కూడా వర్తింప చేశామని, కొత్తగా 8 కోట్ల మందికి ఇఎస్‌ఐ ద్వారా సామాజిక భద్రత కల్పించనున్నామని అన్నారు. కొత్త నిర్ణయంతో 18 కోట్ల మందికి లబ్ది చేకూరుతుందని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులకు 9560 రూపాయిలు ఇచ్చిన వారికి నేడు 13598 రూపాయిలు ఇవ్వాలనే నిబంధన విధించామని, 4030 రూపాయిలు నెలకు పెంచామని, ఇది వారి జీవితంలో ఎంతో మార్పు తెస్తుందని పేర్కొన్నారు. సెక్యూరిటీ గార్డులు గతంలో 10వేలు చెల్లించే వారని, వారి జీతం 16వేలకు పెంచామని, వ్యవసాయ కార్మికులకు 334 రూపాయిలు ఉంటే 8900 రూపాయిల వరకూ పెంచామని వివరించారు. 2020 నాటికి ప్రతి కార్మికుడికి ఇల్లు కట్టించి ఇవ్వాలనే నిర్ణయంతో కేంద్రం ఉందని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సి ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు స్థలాలు ఇస్తే అక్కడ కార్మికులకు ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. ఇఎస్‌ఐ ఆస్పత్రుల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందిస్తామని ఆయన వెల్లడించారు. హైదరాబాద్, కరీంనగర్‌లలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని, అందులో వంద మంది కార్మికుల పిల్లలకు ఉచిత విద్య అందిస్తున్నామని చెప్పారు. దేశానికే ఈ మెడికల్ కాలేజీలు మోడల్ కాబోతున్నాయని తెలిపారు.