జాతీయ వార్తలు

విశాఖ ఐఐఎం డైరెక్టర్‌గా చంద్రశేఖర్ మైలవరపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: విశాఖపట్నంతో పాటు పది ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) డైరెక్టర్లను కేంద్ర ప్రభుత్వం నియమించింది. శుక్రవారం దీనికి సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర సిబ్బంది వ్యవహరాల మంత్రిత్వ శాఖ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోగల విశాఖ ఐఐఎంకి డైరెక్టర్‌గా చంద్రశేఖర్ మైలవరపును నియమించింది. బెంగళూరు ఐఐఎంకు అహ్మదాబాద్ ఐఐఎంలో పబ్లిక్ సిస్టమ్స్ గ్రూప్ చైర్‌పర్సన్‌గా ఉన్న ప్రొ.జి రఘురాంను కేంద్రం నియమించింది. అలాగే శైలేంద్రసింగ్‌ను రాంచీ ఐఐఎంకు, ధీరజ్ శర్మను (హర్యానా) రోహ్తక్ ఐఐఎంకు, భారత్ భాస్కర్‌ను ఐఐఎం రాయ్‌పూర్‌కు కేంద్రం నియమించింది. సంబల్పూర్ ఐఐఎంకు ప్రసాద్ జైస్వాల్‌ను, నాగ్‌పూర్ ఐఐఎంకు ఎల్.ఎస్ మూర్తిలను, తీరుచిరాపల్లీ ఐఐఎంకు భీమరాయ మేత్రిని, ప్రొ. గణేషన్ కన్నభిరన్‌ను బుద్ధగయ ఐఐఎంకు, హిమాచల్ ప్రదేశ్ లోని శ్రీవౌర్ ఐఐఎంకు నీళు రోహ్‌మేత్రాను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.