జాతీయ వార్తలు

ఇంటర్‌సెప్టర్ మిసైల్ ప్రయోగం విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాసోర్ (ఒడిశా), ఫిబ్రవరి 11: రెండు అంచెల ఉపరితల క్షిపణి రక్షణ వ్యవస్థ అభివృద్ధి దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. శనివారం ఒడిశా తీరంలో ఇంటర్‌సెప్టర్ మిసైల్‌ను విజయవంతంగా ప్రయోగించింది. బాలాసోర్‌లోని ఐటిఆర్‌కు చెందిన అబ్దుల్ కలాం ఐల్యాండ్ (వీలర్ ఐల్యాండ్) నుంచి ఉదయం 7.45 గంటలకు ఈ ఇంటర్‌సెప్టర్‌ను ప్రయోగించారు. ఈ పిడివి మిషన్ భూవాతావరణం నుంచి 50 కిలోమీటర్ల ఎత్తులో ఎక్సో-అట్మాస్పియర్ రీజియన్‌లో లక్ష్యాన్ని ఛేదించిందని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఒ) అధికారి ఒకరు తెలిపారు. ‘పిడివి ఇంటర్‌సెప్టర్, రెండు దశల టార్గెట్ మిసైల్- రెండూ కూడా విజయవంతంగా తమ పనిని పూర్తి చేశాయని ఆయన వివరించారు. శత్రువుకు చెందిన బాలిస్టిక్ మిసైల్‌ను పోలినట్లుగా లక్ష్యాన్ని అభివృద్ధి చేసి రెండు వేల కిలోమీటర్ల ఆవల బంగాళాఖాతంలో లంగరు వేసిన నౌక నుంచి ప్రయోగించారు. ఆటోమాటిక్ ఆపరేషన్‌లో రాడార్ ఆధారిత డిటెక్షన్ అండ్ ట్రాకింగ్ వ్యవస్థ దానిని కనుగొని, శత్రువు బాలిస్టిక్ మిసైల్ పథాన్ని పసిగట్టింది. రాడార్ల నుంచి అందుకున్న డాటా సహాయంతో కంప్యూటర్ నెట్‌వర్క్ దూసుకొస్తున్న శత్రువు బాలిస్టిక్ మిసైల్ విక్షేపమార్గాన్ని ముందుగా ఖచ్చితంగా అంచనా వేసింది. కంప్యూటర్ వ్యవస్థ నుంచి అవసరమైన ఆదేశాలు అందగానే క్షిపణి దాడిని అడ్డుకోవడానికి పిడివిని పూర్తి సంసిద్ధంగా ఉంచారు. మైక్రో నావిగేషన్ వ్యవస్థ మద్దతుతో అత్యంత ఖచ్చితత్వంగల ఇనెర్టియల్ నావిగేషన్ వ్యవస్థ (ఐఎన్‌ఎస్) నిర్దేశకత్వంలో ఇంటర్‌సెప్టర్.. బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకోవడానికి అంచనా వేసిన పాయింట్ దిశగా కదిలింది. ఒకసారి ఇంటర్‌సెప్టర్ మిసైల్ వాతావరణాన్ని దాటగానే ఉష్ణ కవచం (హీట్ షీల్డ్) తొలగిపోయింది. లక్ష్యం ఉన్న ప్రదేశాన్ని గుర్తించడానికి ఐఆర్ సీకర్ డోమ్ తెరచుకుంది. ఇనెర్టియల్ గైడెన్స్, ఐఆర్ సీకర్ సహాయంతో ఇంటర్‌సెప్టర్ మిసైల్.. లక్ష్యాన్ని అడ్డుకోవడానికి కదలిపోయింది. వివిధ ప్రదేశాల్లోని టెలీమెట్రీ/ రేంజ్ స్టేషన్లు ఈ సంఘటనలన్నింటిని పర్యవేక్షించాయి. ఇంటర్‌సెప్టర్ మిసైల్‌ను విజయవంతంగా ప్రయోగించిన డిఆర్‌డిఒను, శాస్తవ్రేత్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు.
సైంటిస్టులకు కెసిఆర్ అభినందన
హైదరాబాద్: లాంగ్ రేంజ్ బ్లాస్టింగ్ మిసైల్‌ను రూపొందించినందుకు డిఆర్‌డిఒ శాస్తవ్రేత్తలను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అభినందించారు. ఎపిజె అబ్దుల్ కలాం కాంప్లెక్స్ హైదరాబాద్ సైంటిస్టుల బృందాన్ని, తెలంగాణ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఇండస్ట్రీ, ఐఐటి ఇన్‌స్టిట్యూట్ హైదరాబాద్ బృందాన్ని ఈ టెక్నాలజీకి రూపకల్పన చేసినందుకు డాక్టర్ సారస్వత్‌తో పాటు సైంటిస్టులకు ఆయన అభినందనలు తెలిపారు.