జాతీయ వార్తలు

పిల్లలు వాహనం నడిపితే.. తల్లిదండ్రులకు శిక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: పిల్లలు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి తల్లిదండ్రులు శిక్షకు గురయ్యే రోజులు రాబోతున్నాయి. అవును, మైనారిటీ తీరని పిల్లలు నడుపుతున్న వాహనాలు రోడ్డు ప్రమాదాలకు కారణమైన సంఘటనలు వెలుగుచూసిన నేపథ్యంలో ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులను బాధ్యులను చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. అంటే పిల్లలు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి తల్లిదండ్రులను శిక్షించేందుకు వీలుగా ప్రతిపాదనలు రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా మోటారు వాహనాల చట్టంలో సవరణలు చేయాలని లోతుగా ఆలోచిస్తోంది. ఈ చట్టానికి సవరణలు చేస్తే మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే చట్ట ప్రకారం వారి తల్లిదండ్రులను శిక్షించడానికి వీలవుతుంది. పిల్లలు వాహనాలు నడుపుతూ పట్టుబడితే, ఈ విషయం తల్లిదండ్రులకు తెలుసని, తల్లిదండ్రులే వారిని వాహనాలు నడపడానికి అనుమతించారని చట్టం భావిస్తుందని ఒక ఆంగ్ల దినపత్రిక ప్రచురించిన కథనంలో పేర్కొంది. అయితే రాష్ట్రాలను సంప్రదించి చట్టానికి సవరణలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ నెల మొదట్లో ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో గల లుడ్లో క్యాస్ట్ల్ స్కూల్ సమీపంలో 12వ తరగతి చదువుతున్న ఒక బాలుడు 80 కెఎంపిహెచ్ వేగంతో నడిపిన మెర్సిడెస్ కారు 32 ఏళ్ల యువకుడిని ఢీకొంది. కాగా, భారత్ రోడ్డు ప్రమాదాల వల్ల ఏటా 35 బిలియన్ డాలర్లు నష్టపోతోంది. ఇది దేశ రక్షణ బడ్జెట్ కన్నా కాస్త తక్కువని రోడ్డు భద్రత నిపుణుడు ఒకరు ఇటీవల చెప్పారు.