జాతీయ వార్తలు

12వ స్థానంలో ఢిల్లీ విమానాశ్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత రద్దీ విమానాశ్రయాలలో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం 12వ స్థానంలో నిలించింది. ప్రపంచ వ్యాప్తంగా టాప్ 15 విమానాశ్రయాలలో ఒక భారతీయ విమానాశ్రయం స్థానం దక్కించుకోవడం ఇదే మొదటి సారి. దీనికి సంబంధించిన వివరాలను తాజాగా ఇంటర్నేషనల్ సివిల్ ఏవియోషన్ ఆర్గనైజేషన్ (ఐసిఎఒ) విడుదల చేసింది. అలాగే నవంబర్ 2016 నాటికి ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రపంచ వ్యాప్తంగా 19.1 శాతంతో అత్యధిక పెరుగుదల రేటును నమోదు చేసినట్లు వెల్లడించింది. గత సంవత్సరం నవంబర్ నాటికి 50 మిలియన్ల ప్రయాణీకుల మార్క్ దాటి, దాదాపుగా దేశంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 55.64 లక్షల ప్రయాణికులకు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం సేవలందించింది. ఈ సందర్భంగా ఢిల్లీ విమానాశ్రయం సీఈఓ ప్రభాకరరావు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా టాప్ 15 విమానాశ్రయాల జాబితాలో ఢిల్లీ విమానాశ్రయం చేరడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రతిరోజు ప్రపంచ వ్యాప్తంగా దాదావుగా 127 గమ్యస్థానాలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి వెల్తున్నారని ఆయన వెల్లండించారు.