జాతీయ వార్తలు

500మంది వైద్య విద్యార్థుల అడ్మిషన్లు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/్భపాల్, ఫిబ్రవరి 13: వ్యాపం కుంభకోణానికి సంబంధించిన కేసులో సుప్రీం కోర్టు కొరడా ఝళిపించింది. మధ్యప్రదేశ్‌లో 2008 నుంచి 2012 మధ్య ఐదేళ్ల ఎంబిబిఎస్ కోర్సులో చేరిన 500 మందికి పైగా విద్యార్థుల ప్రవేశాలను సుప్రీం కోర్టు సోమవారం రద్దు చేసింది. ఈ వ్యవహారంలో విద్యార్థులు దాఖలు చేసుకున్న అన్ని పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జెఎస్.కెహర్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. దీంతో విద్యార్థులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వ్యాపం కుంభకోణంతో ప్రమేయమున్న దాదాపు 48 మంది వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఈ కుంభకోణానికి సంబంధించిన కేసులను సుప్రీం కోర్టు 2015 జూలై 9వ తేదీన కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కు అప్పగించింది. తొలుత జబల్పూర్‌లోని గర్హా పోలీసు స్టేషన్‌లో నమోదైన ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను స్వీకరించిన తర్వాత 2015 ఆగస్టు 8వ తేదీన సిబిఐ 60 మంది నిందితులకు వ్యతిరేకంగా తొలి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. వీరంతా 2008, 2009, 2011 సంవత్సరాల్లో వ్యవసాయిక్ పరీక్షా మండల్ (వ్యాపం) లేదా మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు (ఎంపిపిఇబి) నిర్వహించిన ప్రీ మెడికల్ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడటంతో పాటు ఇతరులను మోసగించేందుకు నేరపూరిత కుట్రకు, ఫోర్జరీలకు పాల్పడ్డారని సిబిఐ ఆరోపించింది.