జాతీయ వార్తలు

బెంగాల్ మూడో విడత ఎన్నికల్లో 79శాతానికి పైగా పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 21: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మూడో విడతలో భాగంగా గురువారం నాలుగు జిల్లాల్లోని 62 నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లో 79.22 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడక్కడా చెలరేగిన హింసాత్మక ఘటనల్లో ఒకరు చనిపోయారు. పోలింగ్ జరుగుతున్నప్పుడు అక్కడక్కడ నాటుబాంబులు విసురుకున్న సంఘటనలు జరిగినట్లుగా వార్తలు వచ్చాయని, అన్ని సంఘటనల్లోను దోషులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రతినిధి సందీప్ సక్సేనా మీడియాకు చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు అన్వర్ ఖాన్ ఎన్నికల కమిషన్ అధికారికి వ్యతిరేకంగా పార్టీ మద్దతుదారులను రెచ్చగొట్టడంతో ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, అనంతరం ఆయనను అరెస్టు చేశారని సక్సేనా చెప్పారు. మూడోవిడతలో భాగంగా ముర్షీదాబాద్ జిల్లాలోని మొత్తం 22 అసెంబ్లీ స్థానాలు, నోయిడాలోని 17 నియోజకవర్గాలు, కోల్‌కతాలో ఏడు, గ్రామీణ బర్ధమాన్ జిల్లాలోని 16 నియోజకవర్గాలకు గురువారం ఎన్నికలు జరిగాయి,