జాతీయ వార్తలు

ఉమ్మడి బలపరీక్షా.. మెజార్టీ నేతకు ఆహ్వానమా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: సుప్రీం తీర్పుతో శశికళ రంగం నుంచి తప్పుకోవడంతో తమిళనాడు అన్నాడిఎంకెలో ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుందన్నది మరింత ఆసక్తికరంగా మారింది. శశికళ విధేయుడిగా ఎడప్పడి పళనిస్వామి రంగంలోకి వచ్చారు. ఆయన్ని శాసన సభా పక్ష నేతగా శశివర్గం ఎన్నుకుంది. వెంటనే గవర్నర్‌ను కలుసుకుని ప్రభుత్వ ఏర్పాటుకు పళనిస్వామి సంసిద్ధత వ్యక్తం చేశారు. మరో పక్క పన్నీర్‌సెల్వం కూడా తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావుదృష్టిసారించారు. ఉమ్మడి బల పరీక్ష నిర్వహించడమా లేక మెజార్టీ ఎమ్మెల్యేల బలం ఉన్న నాయకుడ్నే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడమా అన్నది గవర్నర్ ముందున్న అంశాలు. అయితే సోలి సోరబ్జీ సహా ముగ్గురు రాజ్యాంగ నిపుణుల ప్యానల్ చేసే సిఫార్సుల ఆధారంగానే గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అటార్నీ జనరల్ ముకుల్ రోహద్గీ, మాజీ సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్‌లు కూడా ఈ ప్యానల్‌లో ఉన్నారు. 1998లో జగదాంబికా పాల్, కళ్యాణ్ సింగ్ కేసులో
ఉత్తర ప్రదేశ్‌కు సంబంధించి సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పునే గవర్నర్ అనుసరించాలని, ఉమ్మడి బలపరీక్షను నిర్వహించాలని వీరిలో ఇద్దరు నిపుణులు సలహా ఇచ్చారు. కాగా, ముఖ్యమంత్రి పదవికి పనీర్‌సెల్వం, పళనిస్వామి పోటీ పడుతున్నందున మెజార్టీ ఎవరికి ఉందో వారినే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఇతర న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఉమ్మడి బల పరీక్ష అవసరం లేదని, అదే జరిగితే అధికార అన్నాడిఎంకె రెండుగా చీలిపోతుందని, ఇదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోందని ఓ సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ పేర్కొన్నారు. పన్నీర్‌సెల్వంవైపే గవర్నర్ మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోందని, 124మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న పళనిస్వామిని ఎందుకు ఆహ్వానించడం లేదని ప్రశ్నించారు.

చిత్రం.. గవర్నర్‌ను కలిసిన మద్దతుదారుల జాబితా అందిస్తున్న ఏఐఏడిఎంకె శాసన సభాపక్ష నేత పళనిస్వామి