జాతీయ వార్తలు

ఎన్ని మలుపులో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమారు ఇరవై ఏళ్లపాటు సాగిన జయలలిత అక్రమాస్తుల కేసులో సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం తీర్పును వెల్లడించింది. ఎన్నో మలుపులు తిరుగుతూ దేశంలోనే సంచలనం సృష్టించిన ఈ కేసును బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేశారు. కేసు సాగిన తీరు ఇలా ఉంది...
1996 జూన్: అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత అక్రమార్జనపై తమిళనాడు గవర్నర్‌కు స్వామి ఫిర్యాదు
1996 జూన్: డిఎంకె ప్రభుత్వం జయపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది
1996 డిసెంబర్: జయలలిత అరెస్టు
1997 జూన్: జయ, శశికళ, ఇలవరసి, సుధాకరన్‌లపై చార్జిషీట్ దాఖలు
1997 అక్టోబర్: తనను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో జయ పిటిషన్.. కొట్టివేత
2001 మే: అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడిఎంకె ఘన విజయం. ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణస్వీకారం
2001 సెప్టెంబర్: టాన్సీ భూముల కుంభకోణం కేసులో జయను తప్పుపట్టిన సుప్రీం కోర్టు. పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకారం
2002 ఫిబ్రవరి: అండిపట్టి ఉప ఎన్నికల్లో జయ ఘనవిజం. మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకారం
2003 ఫిబ్రవరి: జయలలిత కేసులో మలుపు. ముగ్గురు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రాజీనామా. ప్రాసిక్యూషన్‌కు అడ్డం తిరిగిన పలువురు సాక్షులు
2003 నవంబర్: తమిళనాడులో కేసు విచారణ సజావుగా సాగదని డిఎంకె నేత అంబజగన్ సుప్రీంలో పిటిషన్. బెంగళూరు కోర్టుకు బదిలీ చేస్తూ ధర్మాసనం ఆదేశం
2002 నవంబర్: జయ అక్రమ ఆస్తుల కేసు పునఃప్రారంభం
2005 ఫిబ్రవరి: ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా బివి ఆచార్య నియామకం
2011 అక్టోబర్/నవంబర్: ప్రత్యేక కోర్టుకు పలుమార్లు హాజరై 1399 ప్రశ్నలకు జయలలిత సమాధానం
2012 ఆగస్టు: తాను కొనసాగలేనంటూ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆచార్య రాజీనామా
2013 ఫిబ్రవరి: ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా జి భవానీసింగ్ నియమకం
2013 ఆగస్టు: భవానీ సింగ్‌ను తప్పించిన కర్నాటక ప్రభుత్వం
2013 సెప్టెంబర్: భవానీ సింగ్ ఉపసంహరణపై సుప్రీం కోర్టు ఆగ్రహం. ఆదేశాలు రద్దు
2014 మార్చి: కేసులో వాదోపవాదాలు పూర్తి
2014 ఆగస్టు: తీర్పును రిజర్వ్‌లో ఉంచిన ప్రత్యేక కోర్టు. సెప్టెంబర్ 20 వెలువరిస్తామని ప్రకటన
2014 సెప్టెంబర్: జయలలిత, శశికళ, ఇలవరసి, సుధాకరన్‌లను దోషులుగా ప్రకటించిన కోర్టు. నాలుగేళ్లు జైలు. జయకు వంద కోట్ల జరిమానా. మిగతా ముగ్గురికి ఒక్కొక్కరికి 10 కోట్ల జరిమానా
2014 అక్టోబర్: జయకు బెయిల్ మంజూరు
2014 డిసెంబర్: సుప్రీం కోర్టులో బెయిల్ మంజూరు
2015 జనవరి: ట్రయల్ కోర్టు తీర్పుపై జయ సవాల్. జస్టిస్ సిఆర్ కుమారస్వామి నేతృత్వంలో ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటుచేసిన కర్నాటక హైకోర్టు
2015 మే: జయతోపాటు ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించిన హైకోర్టు
2015 జూన్: ప్రత్యేక బెంచ్ తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసిన కర్నాటక ప్రభుత్వం
2016 జనవరి: అక్రమాస్తుల లెక్కల్లో తప్పిదాలు చోటుచేసుకున్నాయని.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వివరణ ఇచ్చిన కర్నాటక
2016 ఫిబ్రవరి: సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభం
2016 జూన్: ముగిసిన వాదోపవాదాలు. తీర్పును రిజర్వ్‌లో ఉంచిన సుప్రీం కోర్టు
2016 డిసెంబర్: జయలలిత మృతి
2017 ఫిబ్రవరి: జయలలిత, శశికళ, ఇలవరసి, సుధాకరన్‌ను దోషులుగా ప్రకటించిన సుప్రీం కోర్టు. ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించిన ధర్మాసనం. శశికళకు నాలుగేళ్ల జైలు. పది కోట్ల జరిమానా.