జాతీయ వార్తలు

మెజారిటీ నాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 14: అన్నాడిఎంకె సీనియర్ నేత ఎడప్పడి కె పళనిస్వామి ఆ పార్టీ శాసనసభా పక్ష నేతగా మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనకు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేల సంతకాలున్న లేఖతో తమిళనాడు గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావుతో సాయంత్రం భేటీ అయ్యారు. తమ పార్టీకి చెందిన మెజార్టీ శాసనసభ్యులు తనకు మద్దతునిస్తున్నారని, ప్రభుత్వం ఏర్పాటుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన గవర్నర్‌కు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తనను ఆహ్వానించాలని ఆయన విద్యాసాగర్ రావును కోరారు. అంతకుముందు ఉదయం నుంచే చెన్నై రాజకీయ వర్గాల్లో ఎడతెగని హడావిడి మొదలైంది. పార్టీ ప్రధాన కార్యదర్శి వికె శశికళ, ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తనను దోషిగా నిర్ధారించటంతో ఒక్కక్షణం ఆలస్యం చేయకుండా పావులు కదిపారు. సోమవారం రాత్రి ఎమ్మెల్యేలు బస చేసిన గోల్డెన్‌బే రిసార్ట్స్‌లోనే మకాం వేసిన శశికళ, కోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలో ముందే వ్యూహరచన చేసుకున్నారు. తీర్పు వెలువడిన క్షణాల్లోనే పన్నీర్‌సెల్వం గ్రూపును పార్టీనుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ఆ వెంటనే రిసార్ట్‌లోనే పార్టీ శాసన సభా పక్షాన్ని సమావేశపరిచారు. శాసనసభా పక్ష నేతగా తన స్థానంలో పార్టీ సీనియర్ నేత కె.పళనిస్వామి పేరును ఆమె స్వయంగా ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలందరి ఏకగ్రీవ ఆమోదంతో ఆయన ఎన్నికైనట్లు ప్రకటించారు. ఆ తరువాత ఒక అధికారిక లేఖను గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఫాక్స్‌ద్వారా పంపించారు. మంగళవారం సాయంత్రం అప్పాయింట్‌మెంట్ ఇవ్వాలని ఆయన్ను ఆ లేఖలో కోరారు. సాయంత్రం 5.45గంటలకు గవర్నర్ అప్పాయింట్‌మెంట్ ఇచ్చారు. సాయంత్రంవరకూ శశికళ తన మద్దతు దారులతో సుదీర్ఘంగా మంతనాలు జరుపుతూనే ఉన్నారు. అన్నాడిఎంకె ప్రిసీడియం చైర్మన్ కె ఏ సెంగొట్టియన్, మంత్రులు డి.జయకుమార్, పి.తంగమణి, ఎస్‌పి వేలుమణి సహా 11మంది తోడురాగా పళనిస్వామి సాయంత్రం గవర్నర్‌తో భేటీ అయ్యారు. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల లేఖ ఆయనకు అందించారు. తనను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు.
ఎవరీ పళనిస్వామి?
పళనిస్వామి శశికళకు విధేయుడిగా పేరున్న శాసనసభ్యుడు. సేలం జిల్లా నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నాయకుడు. 1989, 1991, 2011, 2016 సంవత్సరాలలో ఎడపాడి నియోజకవర్గం నుంచి అన్నాడిఎంకె పార్టీ తరపున శాసనసభకు ఎన్నికయ్యారు. దివంగత నేత జయలలితకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఆయన ఇప్పుడు శశికళకు విధేయుడిగా ఉన్నారు. ప్రస్తుతం తమిళనాడు కేబినెట్‌లో హైవేలు, ప్రజాపనులు, చిన్న తీరాల విభాగాలను చూస్తున్నారు. గతంలో జయలలిత కేబినెట్‌లో ఏయే శాఖలను నిర్వహించారో వాటినే ఇప్పుడూ ఆయన నిర్వహిస్తున్నారు. అనేక సంక్షోభాల్లో జయలలితకు అండగా నిలిచిన పళనిస్వామి గతంలో ఆమె కేబినెట్‌లో పలు శాఖలను నిర్వహించారు. పార్టీలో చాలా బలమైన కేడర్ అండగా ఉన్న నాయకుల్లో ఆయన ఒకరు.

జయలలితతో
పళనిస్వామి (ఫైల్ ఫొటో)