జాతీయ వార్తలు

గెలుపు గుర్రం పిఎస్‌ఎల్‌వి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 14: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రూపొందించిన వాహక నౌకల్లో పిఎస్‌ఎల్‌వి ముఖ్యమైనది. 1993కు ముందు ఎస్‌ఎల్‌వి, ఎఎస్‌ఎల్‌వి ద్వారా ఏడాదికి కేవలం ఒకే ఒక ప్రయోగం మాత్రమే చేపట్టేవారు. పిఎస్‌ఎల్‌వి అందుబాటులోకి వచ్చిన తరువాత తొలి ప్రయోగం మినహ మిగిలిన అన్ని ప్రయోగాలు వరుస విజయాలతో ఇస్రో ఖ్యాతి ప్రపంచ దేశాలకు పాకింది. ఇస్రో గెలుపు గుర్రంగా ఈ వాహక నౌకను చెబుతారు. అంతేకాకుండా నమ్మిన బంటు కూడా. ఈ వాహక నౌక ద్వారా మన శాస్తవ్రేత్తలు సునాయసనంగా విజయం అందుకొంటున్నారు. అంతేకాకుండా వివిధ పరీక్షలు కూడా చేసి విజయం సాధిస్తున్నారు. ఇంతకు ముందు ఒకే కక్ష్యలోకి మాత్రమే ఉపగ్రహాలను పంపించే వారు. పిఎస్‌ఎల్‌వి ద్వారా రెండు వివిధ కక్ష్యలోకి ప్రయోగాత్మకంగా చేపట్టి విజయం సాధించారు. అంతేకాకుండా మామ్ ప్రయోగాన్ని గంటకు పైగా సుదీర్ఘ సమయం పాటు చేపట్టారు. చంద్రయాన్-1, ఒకేసారి 10, 20 ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి విజయవంతంగా పంపించి ఉన్నారు. తొలి ప్రయోగం అపజయం చెందడంతో దానిని పునాది తీసుకొన్న శాస్తవ్రేత్తలు నేడు వరుస విజయాలకు పునాదిగా మారింది. అనంతరం రూపొందించిన జిఎస్‌ఎల్‌వి ప్రయోగాల్లో కూడా ఊహించని విధంగా విజయాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం 104 ఉపగ్రహాల ప్రయోగానికి కూడా ఇస్రో గెలుపు గుర్రం పిఎస్‌ఎల్‌వినే ఎన్నుకోవడం విశేషం.