జాతీయ వార్తలు

ఉగ్రవాదాన్ని అణచివేయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అణచివేయాల్సిందేనని భారత్ ఉద్ఘాటించింది. చైనాలో ఐదు రోజుల పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచానికే పెను సవాల్‌గా మారిన ఉగ్రవాదంపై తమ వైఖరి స్పష్టంగా ఉందన్నారు. ఉగ్రవాదుల్లో మంచి, చెడూ అంటూ ఉండరని ఆయన వ్యాఖ్యానించారు. తన చైనా పర్యటన వివరాలను ఆయన వివరించారు. ఆక్రమిత కాశ్మీర్, చైనా దళాల ప్రమేయం సహా కీలకమైన సరిహద్దు సమస్యపై చర్చించినట్టు పారికర్ వెల్లడించారు.‘ఉగ్రవాదులు,ఉగ్రవాద చర్యలపై మేం ఎలాంటి ఉదాసీనత చూపబోమని గట్టిగా చెప్పాం. ఉగ్రవాదుల్లో తేడాలుండవు. వారి సిద్ధాంతాలు, కార్యాచరణ ఏ రూపంలో ఉన్నప్పటికీ ఒకటే’ అని చైనాకు చెప్పినట్టు రక్షణ మంత్రి పేర్కొన్నారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో సమావేశం సందర్భంగానూ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ విషయాలు చాలా స్పష్టంగా చెప్పారని పారికర్ అన్నారు. పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి, దానికి వ్యూహకర్త మసూద్ అజార్ చైనా తీరును ఆయన ఉదాహరించారు. ఈ విషయంలో భారత్ వైఖరి ఏమిటో చైనాకు చాలా స్పష్టంగా చెప్పామన్న రక్షణ మంత్రి దీనిపై విచక్షణతో నిర్ణయం తీసుకోవల్సింది వారేనని అన్నారు. అనేక అంతర్జాతీయ వేదికలపై భారత్ తన వైఖరిని వెల్లడించిందని ఆయన గుర్తుచేశారు. తన చైనా పర్యటన విజయవంతమైందన్న పారికర్ సరిహద్దుల్లో ఉద్రిక్తలు తొలగించడంతోపాటు పరస్పర అవగాహన, సహకారంతో ముందుకు పోవాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.