జాతీయ వార్తలు

రోదసి మనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వవీధిలో భారత్ జయకేతనం ఎగరేసింది. రోదసిని అందిపుచ్చుకోవడమే కాదు, అగ్రరాజ్యాలు సైతం ఔరా! అంటూ ముక్కున వేలేసుకునే అద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రపంచ శాస్త్ర సాంకేతిక రంగంలో ఇప్పట్లో ఎవరికీ సాధ్యంకాని రికార్డు నెలకొల్పింది. ఆ ఉత్సాహంతో
తన రికార్డును తానే అధిగమించే దిశగా గగనవీధిలో గెలుపు కేతనాలు
ఎగరేస్తామని ప్రకటించుకుంది. ఇప్పుడిక రోదసి మాది. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచానికి మార్గదర్శి భారత్ అని ఎలుగెత్తి చాటే
మహదవకాశాన్ని దేశానికి అందించారు ఇస్రో శాస్తవ్రేత్తలు.

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 15: ఒకటో రెండో కాదు. పదో పరకో అసలే కాదు. ఒక్క ప్రయోగంతో 104 ఉపగ్రహాలను ఒకే రాకెట్ ద్వారా నింగిలోకి పంపించారు ఇస్రో శాస్తవ్రేత్తలు. ప్రపంచం మొత్తం కళ్లప్పగించి చూస్తుండగానే, నాలుగో దశ పయనంలో ఉప గ్రహాలను సమర్థంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ప్రపంచ దేశాలతోపాటు 120 కోట్ల భారతీయ ప్రజ ఉత్కంఠతో గగనంవైపు చూస్తుండగానే, కళ్లముందే క్షణాల్లో మెరుపులా దూసుకుపోయింది పిఎస్‌ఎల్‌వి -సి 37. భారత కీర్తిపతాకను వినువీధిన ఎగరేసింది శ్రీహరికోట భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్). ఇస్రో పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన, దేశ సాంకేతిక పరిజ్ఞానికి కొలమానంగా నిలచిన పిఎస్‌ఎల్‌వి-సి 37 రాకెట్ ఇస్రో కలలను నిజం చేసింది. వరుస విజయాలు రుచి చూపించిన పిఎస్‌ఎల్‌వి రాకెట్ మరోమారు తన సత్తాను ప్రపంచ దేశాలకు చాటిచెప్పింది. వరుస అంతరిక్ష ప్రయోగాలతో దూసుకెళ్తూ విజయం సాధిస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈసారి అనితర సాధ్యమైన విజయానే్న నమోదు చేసింది. ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కార్టోశాట్-2డి ఉపగ్రహంతోపాటు ఇస్రో రూపొందించిన రెండు నానో ఉపగ్రహాలు, అమెరికాకు చెందిన 96 ఉపగ్రహాలు, నెదర్లాండ్, స్విట్జర్లాండ్, ఇజ్రాయిల్, కజికిస్తాన్, యుఏఇ దేశాలకు చెందిన 5 ఉపగ్రహాలు కలిపి 104 ఉప్రగహాలను నమ్మినబంటు పిస్‌ఎల్‌వి సి- 37 వాహక నౌక ద్వారా 30 నిమిషాల వ్యవధిలో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. బుధవారం ఉదయం 9:28కి షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుండి ఎరుపు, నారింజ రంగుల్లో నిప్పులు చిమ్ముతూ పిఎస్‌ఎల్‌వి-సి 37 నింగిలోకి దూసుకెళ్లింది. కడుపున మోసుకెళ్లిన 104 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి కచ్చితంగా ప్రవేశపెట్టడంతో ఇస్రోలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. పిఎస్‌ఎల్‌వి-సి 37 రాకెట్ భూమి నుంచి నింగికి ఎగిరిన అనంతరం మూడు దశలను సునాయసంనంగా పూర్తిచేసి నాలుగో దశలో రాకెట్‌లోని ఉపగ్రహాలు ఒకదాని తరువాత ఒకటిగా అత్యంత జగ్రత్తగా కక్ష్యలోకి చేర్చింది. నాలుగో దశ పయనం ముగుస్తున్న సమయంలోనే విజయ కేతనం మనదేనంటూ అధికారికంగా ప్రకటించేశారు ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్. తొలుత కార్టోశాట్-2డి ఉపగ్రహాన్ని 17:30 నిమిషాల తరువాత భూమికి 510 కిమీ ఎత్తులో సూర్యనువర్తన ధృవ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన పిఎస్‌ఎల్‌వి, అనంతరం ఇస్రోకు చెందిన రెండు నానో ఉపగ్రహాలు ఐఎన్‌ఎస్- 1ఎ 17:39 నిమిషాలకు, ఐఎన్‌ఎస్-1బి 17:40 నిమిషాలకు కక్ష్యలోకి చేర్చింది. అనంతరం 18.40 నిమిషాలకు ప్రథమ పెట్టెల్లో అమర్చిన అమెరికా విదేశీ నానో ఉపగ్రహాలు కక్ష్యలోకి చేర్చి పిఎస్‌ఎల్‌వి తన సత్తా చాటడంతో దేశం మొత్తం ఇస్రోకు జయహో ప్రకటించింది.