జాతీయ వార్తలు

పీఠం ఎవరిది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 15: తమిళనాడు రాజకీయ అనిశ్చితి నిర్ణయాత్మక దశకు చేరుకుంది. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడ్డ శశికళ జైలుపాలు కావడంతో తాజాగా తెరపైకి వచ్చిన పళనిస్వామిని గవర్నర్ విద్యాసాగర్‌రావు పిలుస్తారా? లేక ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకే అవకాశమిస్తారా? అన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇటు పళనిస్వామి, అటు పన్నీర్‌సెల్వంలు బుధవారం గవర్నర్‌ను కలుసుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేశా రు. తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేల జాబితాను అందించారు. ఈ నేపథ్యంలో అధికారికంగా గవర్నర్‌నుంచి ఏ రకమైన సంకేతాలు వెలువడలేదు. ఇంతకాలం ఆదాయానికి మించి న ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురుచూసిన గవర్నర్‌కు ఇప్పుడు ఆ ఇరకాటం ఏమీ లేదు. అన్నాడిఎంకె శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన పళనిస్వామి గవర్నర్‌ను కలుసుకుని తనకు 124మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని స్పష్టం చేశారు. ఆయనతోపాటు రాష్ట్ర ఫిషరీల మంత్రి డి.జయకుమార్ కూడా గవర్నర్‌తో భేటీ అయ్యారు. తమకు ఎంతమంది మద్దతు ఉందన్న దానిపై గవర్నర్‌కు స్పష్టమైన వివరణ ఇచ్చామని, తమ అభ్యర్థనను పరిశీలిస్తామని గవర్నర్ హామీ ఇచ్చినట్లు జయకుమార్ తెలిపారు. ప్రజాస్వామ్యానికి పూర్తిస్థాయిలో న్యాయం జరగగలదన్న నమ్మకం తనకుందన్నారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు కలిగిన పళనిస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించాల్సిందేనని స్పష్టం చేశారు. తమ వర్గానికి 124మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే పన్నీర్ సెల్వానికి ఎనిమిదిమంది వత్తాసే ఉందన్నారు. దీన్నిబట్టి చూసినా ఎవరిది మెజార్టీనో కళ్లకు కడుతోందన్నారు. 224మంది సభ్యులు కలిగిన తమిళనాడు అసెంబ్లీలో అన్నాడిఎంకెకు 134మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
కాగా, గవర్నర్‌తో విడిగా భేటీ అయిన పన్నీర్ సెల్వం తనకే మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర విద్యామంత్రి కె.పాండ్యరాజన్, ఎమ్మెల్యేలు, ఇతర సహచరులతో కలిసి ఆయన గవర్నర్‌ను కలుసుకున్నారు. తనకు మెజారిటీ నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. అన్నాడిఎంకె ఎమ్మెల్యేలను చెన్నై సమీపంలోని ఓ శిబిరంలో నిర్బంధించారని కూడా పన్నీర్ సెల్వం గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌నుంచి ఆహ్వానం కోసం ఎదురుచూస్తున్నామని అనంతరం మీడియా సమావేశంలో పన్నీర్ సెల్వం వర్గం స్పష్టం చేసింది.
వారం రోజుల్లో అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి బలపరీక్షను నిర్వహించాలని ఇప్పటికే అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి రాష్ట్ర గవర్నర్‌కు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు ప్రతికూలంగా వచ్చినప్పటికీ శశికళ వర్గంలోని ఎమ్మెల్యేల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. అన్నాడిఎంకెకు చెందిన 124మంది ఎమ్మెల్యేల్లో 120మంది మద్దతు ఇప్పటికీ ఆమెకే ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడుతున్న పన్నీర్ సెల్వం పక్షాన పదిమంది ఎంపీలు, కొద్దిమంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. తమ తరపున ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని స్పష్టం చేయలేకపోతున్న పన్నీర్ సెల్వం అసెంబ్లీలో అవకాశం ఇస్తే తన మెజార్టీని నిరూపించుకుంటానని చెబుతున్నారు. నేడు గవర్నర్‌తో భేటీ అయిన సందర్భంగా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అన్నాడిఎంకెలోని రెండు వర్గాలు తమకే మద్దతు అంటూ గవర్నర్ ముందే స్పష్టం చేసిన నేపథ్యంలో తదుపరి నిర్ణయం ఏమిటన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

చిత్రం..ఇరు వర్గాలతో మాట్లాడుతున్న తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్‌రావు