జాతీయ వార్తలు

శత్రువుల మధ్య స్నేహమేల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కనౌజ్ (ఉత్తరప్రదేశ్), ఫిబ్రవరి 15: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న అధికార సమాజ్‌వాదీ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. సినిమాలో శత్రువులు ఇద్దరు విరామం (ఇంటర్వల్) తరువాత స్నేహితులు అవుతారని, ఎస్‌పి, కాంగ్రెస్‌ల తీరు కూడా అలాగే ఉందని ఆయన విమర్శించారు. బుధవారం ఇక్కడ ఆయన ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ ‘ఉత్తరప్రదేశ్ రాజకీయ వేదికపై ఒక సినిమా ప్రదర్శించబడింది. ‘27 సాల్ యుపి బేహాల్’ వంటి నినాదాలతో యాత్రలు నిర్వహించి పరస్పరం తలపడిన ప్రత్యర్థులు ఇంటర్వల్ తరువాత స్నేహితులయ్యారు. పరస్పరం కౌగిలించుకున్నారు’ అని మోదీ అన్నారు. కపట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా ఉంటారో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌కు తెలియదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్‌పై 1984లో జరిగిన హత్యాయత్నాన్ని ఆయన గుర్తుచేశారు. నోట్ల రద్దుపై పెడబొబ్బలు పెడుతూ గందరగోళం సృష్టించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని మోదీ ధ్వజమెత్తారు. తనపై అన్ని రకాల ఆరోపణలు చేసిందని, అయితే దేశ ప్రజలు ఇప్పుడు చైతన్యవంతమై ఉన్నందున అసత్యాలు పనిచేయవని ఆయన పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికలను ప్రకటించడానికి ముందు సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు పరస్పరం వ్యతిరేకంగా ప్రచారం చేసుకున్నాయని, కాని, ఇంటర్వల్ తరువాత ఎన్నికల్లో జట్టు కట్టడానికి ఇరు పార్టీలు ఒక్కటయ్యాయని మోదీ అన్నారు. అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కన్నౌజ్‌లో బిజెపి నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఎస్‌పి-కాంగ్రెస్ కూటమి వల్ల మీ స్వప్నాలు చెదిరిపోతాయి’ అని ఆయన ప్రజలను ఉద్దేశించి అన్నారు. ములాయం సింగ్ యాదవ్‌పై 1984లో కాంగ్రెస్ పార్టీ చేసిన హత్యాయత్నాన్ని అఖిలేశ్ యాదవ్ ఎలా మరచిపోయారని ఆయన నిలదీశారు. తండ్రిని హతమార్చడానికి యత్నించిన వారితో స్నేహం చేయడంకన్నా సిగ్గుచేటు మరోటి ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు. అలాంటి వారు క్షమార్హులు కారని అన్నారు. 1984లో విధాన్ పరిషత్‌లో ప్రతిపక్ష నాయకుడిగా ములాయం సింగ్ యాదవ్ చేసిన విమర్శలను కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేక పోయిందని, ఈ నేపథ్యంలో 1984 మార్చి 4న ఆయన కారుపై కాల్పులు జరిగాయని మోదీ పేర్కొన్నారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక బలమైన నాయకుడే ఈ దాడికి కారణమని ఆరోపణలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ తొడలపై కూర్చునే ముందు ఈ సంఘటనను గుర్తుకు తెచ్చుకోవాలని ఆయన అఖిలేశ్‌కు హితవు పలికారు.

చిత్రం..ఎన్నికల సభలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ