జాతీయ వార్తలు

కేంద్ర కేబినెట్‌లో చర్చకురాని చట్టబద్ధత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత కల్పించే అంశం బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం పరిశీలనకు రాలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే కేంద్ర మంత్రివర్గం సమావేశంలో ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించే ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడుతుందని వార్తలు రావటం తెలిసిందే. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించే ప్రతిపాదనను మంత్రివర్గం పరిశీలనకు పెట్టినట్లు పత్రికలు రాశాయి. అయితే బుధవారం సాయంత్రం జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశం ముందుకు ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిచే ప్రతిపాదన రాలేదు. ఏ.పికి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిచే అంశంపై కేంద్రానికి, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. అందుకే మంత్రివర్గం పరిశీలనకు రాలేదని చెబుతున్నారు.