జాతీయ వార్తలు

కంగుతిన్న కమలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ‘ఉత్తరాఖండ్’ తీర్పుపై భారతీయ జనతాపార్టీ ఒక్కసారిగా ఖంగుతింది. హరీశ్‌రావత్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించటంతో పాటు, రాష్టప్రతి పాలన విధింపుపై ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధినాయకత్వం ఆందోళన చెందింది. హైకోర్టు తీర్పుపై శుక్రవారం సుప్రీం కోర్టులో సవాలు చేయాలని పార్టీ గురువారం పొద్దుపోయాక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు అమిత్‌షా, సీనియర్ మంత్రులతో పాటు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీతో సమావేశమై హైకోర్టు తీర్పులోని న్యాయపరమైన అంశాలపై చర్చించారు. శుక్రవారం ఉదయం సుప్రీం కోర్టు ప్రారంభం కాగానే ప్రధాన న్యాయమూర్తి టీ ఎస్ ఠాకూర్ ధర్మాసనం ఎదుటకు ఈ అంశాన్ని ప్రస్తావనకు తెస్తామని, హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాల్సిందిగా కోరతామని రోహత్గీ తెలిపారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రా, కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్‌రిషిలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ద్రవ్యబిల్లు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఆమోదం పొందకపోవటం, 9మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వంటి పరిణామాలు రాష్టప్రతి పాలన విధించటానికి కారణాలుగా సుప్రీం కోర్టుకు చెప్పవచ్చని రోహత్గీ బీజేపీ పెద్దలకు వివరించినట్లు సమాచారం.