జాతీయ వార్తలు

ఆ మూడింటితో ముప్పే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హార్దోయ్, ఫిబ్రవరి 16: ఉత్తరప్రదేశ్‌లో సమస్యలన్నింటికీ రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం ఏలిన సమాజ్‌వాది, బహుజన్‌సమాజ్, కాంగ్రెస్‌లే కారణమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరోపించారు. రాష్ట్రంలో పుష్కలంగా వనరులున్నా కోట్లాది కార్మికులు పేదరికంలో మగ్గటానికి ఆ మూడు పార్టీలే కారణమని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్‌కు తాను దత్త పుత్రుణ్ణని ఈ రాష్ట్రానికి సేవ చేయటం తన బాధ్యత అని మోదీ అన్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎస్పీ, బి ఎస్పీ, కాంగ్రెస్‌ల చేతుల్లో లేదని ఆయన వ్యాఖ్యానించారు. యూపిలోని హార్దోయ్‌లో ఎన్నికల ప్రచార సభలో ఆయన గురువారం మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడిని ఆయన గుర్తు చేశారు. ‘‘శ్రీకృష్ణుడు ఉత్తరప్రదేశ్‌లో జన్మించాడు. గుజరాత్‌ను తన కర్మభూమిగా మలచుకున్నాడు. నేను గుజరాత్‌లో జన్మించాను. ఉత్తరప్రదేశ్ నన్ను దత్తత తీసుకుంది. నా తల్లీతండ్రీ యూపీ యే. నేను తల్లిదండ్రులను వెన్నుపోటు పొడిచే కొడుకును కాదు. మీరు నన్ను దత్తత తీసుకున్నారు. మీకోసం పని చేయటం నా విధి.’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘బిజెపికి పూర్తి మెజారిటీ వచ్చేలా ఓటేయండి. నేను మీ సమస్యలన్నింటికీ అయిదేళ్లలో పరిష్కారం చూపిస్తా’’ అని ఆయన ఓటర్లకు వాగ్దానం చేశారు. యూపీ గంగా యమున వంటి జీవనదులు పారే రాష్ట్రం. అయినా కోట్లాది కార్మికులు ఇంకా పేదరికంలోనే మగ్గటానికి కారణమెవరు? ప్రజల్లో పొరపాటుందా? సామర్థ్యంలో లోపముందా? లేక వనరులు లేవా? అని ఆయన ప్రశ్నించారు. ‘ ఇదంతా ప్రభుత్వాలకు బాధ్యత
లేకపోవటం వల్లనే అవుతోంది. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లు రాష్ట్రం అభివృద్ధి కావాలని కోరుకోలేదు. మిమ్మల్ని కేవలం ఓటుబ్యాంకులాగానే పరిగణించాయి. యూపీలో 1.25 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇవ్వటం కోసం ఒక స్కీం తీసుకువచ్చింది. కానీ నిధులు మురిగటిపోతున్నాయి. యూపీలో కేవలం 13వేల కుటుంబాలకు మాత్రమే విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. పేదలకు విద్యుత్ కనెక్షన్లు ఇస్తే అఖిలేశ్‌కు నష్టం జరుగుతుందా? ఈ పథకం అమలు కాకపోవటానికి ఎవరు బాధ్యులు? ఇలాంటి ప్రభుత్వాలు ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండరాదు’’అని మోదీ అన్నారు. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయాలుగా మారిపోయాయని ఆయన ఆరోపించారు. అక్రమ ఆయుధాల చట్ట వ్యతిరేక వినియోగం వల్ల కనీసం 3000మంది చనిపోయారన్నారు. ఆయుధాల చట్టం కింద దేశంలో నమోదైన కేసుల్లో 50శాతం యూపీలో నమోదైనవేనని ఆయన అన్నారు. యూపీలో అక్రమ గనుల తవ్వకం గురించి ధైర్యంగా రాసే జర్నలిస్టు లేడని ఆయన వ్యాఖ్యానించారు.