జాతీయ వార్తలు

మీరే అలా మాట్లాడితే ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,్ఫబ్రవరి 16: రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు బాధ్యతాయుతంగా మెలగాలని రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం హితవు చెప్పింది. ఆయన లాంటి నాయకులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేలా మాట్లాడటం తగదని కేంద్ర ఎన్నికల సంఘం గురువారం హెచ్చరించింది. అసెంబ్లీ ఎన్నికల సంధర్భంగా ఉత్తర గోవాలో చేసిన ప్రసంగాన్ని తప్పుపట్టింది. ఎన్నికల సభల్లో ప్రసంగంచే సమయంలో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలని ఈసీ ఆయనకు హితవు చెప్పింది. మనోహర్ పారికర్ గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సంధర్భంగా ఉత్తర గోవాలో బిజెపి ఏర్పాటు చేసిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ‘మీరు ఓటు వేసేందుకు రెండు వేల రూపాయలు తీసుకోవచ్చు, ఇది ఓ.కె, కొందరు ఎన్నికల ర్యాలీలు నిర్వహించవచ్చు, ఇది కూడా ఓ.కె, తమకు ఎలాంటి అభ్యంతరం లేదు, కొందరు ఐదు వందల రూపాయలు తీసుకుని ఇక్కడ తిరగవచ్చు అయితే ఓట్లు కేవలం బిజెపికి పడాలనేది మీరు మనసుల పెట్టుకోవాలి’ అని సూచించారు. మనోహర్ పారికర్ చేసిన ఈ ప్రసంగంపై ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రసంగానికి సంబంధించిన సిడిలను పలుమార్లు పరిశీలించటంతోపాటు ఆయన కొంకణి భాషలో చేసిన ప్రసంగాన్ని ఈ భాష తెలిసిన నిపుణులతో చర్చించి ఈ హెచ్చరిక చేసింది. డబ్బు తీసుకుని ఓటు వేయటాన్ని ప్రోత్సహించటం ఎంత మాత్రం మంచిది కాదని ఈసీ పేర్కొంది.