జాతీయ వార్తలు

ఎస్‌పి-కాంగ్రెస్ కూటమి 2019లోనూ ఉంటుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్, ఫిబ్రవరి 16: ఉత్తరప్రదేశ్‌లో ఎస్‌పి-కాంగ్రెస్ కూటమి 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని, మిగతా లౌకిక పార్టీలు కూడా ఈ కూటమిలో చేరుతాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ తెలిపారు. బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) కూడా ఈ మహాకూటమిలో చేరుతుందా? అని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ, కాషాయ పార్టీ (బిజెపి)కి వ్యతిరేకంగా పోరాడటానికి లౌకిక పార్టీలన్నీ కలిసి రావాలని తాము కోరుతున్నామని ఆయన ఒక వార్తాసంస్థకు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో లౌకిక పునాదిని బలోపేతం చేయాలంటే, మనం కలిసి పనిచేయవలసిన అవసరం ఉందని సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలు భావించాయని, అందువల్ల లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీల కూటమి కొనసాగుతుందని ఆయన వివరించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో లౌకిక పార్టీలు విడివిడిగా పోటీ చేసి బాగా నష్టపోయాయని, అందుకే బిజెపి 73 స్థానాల్లో గెలవగలిగిందని ఆయన పేర్కొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్, ఎస్‌పి, ఆర్‌ఎల్‌డి కలిసి పోటీచేస్తే, బిజెపి పది నుంచి 15 స్థానాలకు మించి గెలవలేదని ఆయన పేర్కొన్నారు.
నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయినప్పటికీ, ఆ పదవికి అవసరమైన పరిణతి, గాంభీర్యం ఇప్పటికీ ఆయనలో లేవని ఆజాద్ విమర్శించారు. బహుశా, ఈ కారణంవల్లే మోదీ ఉపన్యాసాలు మరీ దిగజారుతున్నాయని అన్నారు. తాను ఈ విషయాన్ని పార్లమెంటులోనే మోదీకి చెప్పానని తెలిపారు. మోదీ ఇప్పటికైనా ప్రధానమంత్రి పదవికి ఉన్న ప్రతిష్ఠను, గౌరవాన్ని కాపాడాలని తాను సూచించానని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో పోలింగ్ జరిగిన అన్ని నియోజకవర్గాలలో ఎస్‌పి-కాంగ్రెస్ కూటమే మొదటి స్థానంలో ఉందని ఆజాద్ అన్నారు. తమ కూటమికి 275కు పైగా స్థానాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ముస్లింల ఓట్లను చీల్చడానికే ఉత్తరప్రదేశ్‌కు వచ్చారని, ఇందుకు ప్రతిఫలంగా ఆయన బిజెపి నాయకుల నుంచి రూ.వందల కోట్లు పుచ్చుకున్నారని ఆజాద్ ఆరోపించారు. కాని, ముస్లింలు తెలివైనవారని వారు ఎంఐఎంకు ఓటు వేయరని పేర్కొన్నారు.