జాతీయ వార్తలు

విజయదుందుభి మోగిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైన్‌పురి (ఉత్తరప్రదేశ్), ఫిబ్రవరి 16: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకు తనపై విమర్శలు కురిపించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఎదురుదాడికి దిగారు. తనకు అనుభవం లేకపోవడంవల్ల కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టానని మోదీ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. తాను సైకిల్‌ని వేగంగా నడపడం నేర్చుకున్నానని, అందువల్ల బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి)కి చెందిన ఏనుగు కాని, బిజెపికి చెందిన కమలం కాని సమాజ్‌వాదీ పార్టీ దరిదాపుల్లోకి కూడా రాలేకపోతున్నాయని పేర్కొన్నారు. తండ్రి ములాయం సింగ్ యాదవ్‌పై 1984లో జరిగిన హత్యాయత్నం కాంగ్రెస్ పనేనని, అలాంటి పార్టీతో అఖిలేశ్ యాదవ్ ఎలా పొత్తు పెట్టుకున్నారని మోదీ బుధవారం కనౌజ్ సభలో విమర్శించిన విషయం తెలిసిందే. అయితే మోదీ సలహాదారులు ఆయనకు తాజాగా జరిగిన ఫిరోజాబాద్ ఉదాహరణ చెబితే ఇంకా బాగుండేదని అఖిలేశ్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘కాంగ్రెస్‌పై నాకు ఆగ్రహం కలిగించేందుకు ఆయన (మోదీ) 1984 వరకు ఎందుకు పోయారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు (రాజ్‌బబ్బర్) ఇటీవలి ఫిరోజాబాద్ ఉప ఎన్నికల్లో మమ్మల్ని ఓడించిన ఘటనను పేర్కొని ఉండాల్సింది’ అని అఖిలేశ్ అన్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయినందునే బిజెపి వారు పాత సంఘటనలను మళ్లీ గుర్తుచేస్తున్నారని ఆయన విమర్శించారు. ‘వారు నాకు అనుభవం లేదని పేర్కొన్నారు. ఎవరైనా కనీసం ఒక్కసారయినా పడిన తరువాతే సైకిల్ (ఎస్‌పి ఎన్నికల చిహ్నం)ను నడపగలుగుతారు. నేను సైకిల్‌ను నడపడమే కాకుండా ఎంతో వేగంగా నడుపుతున్నాను. అందువల్ల ఏనుగు కాని, కమలం కాని ఎక్కడా దరిదాపుల్లోకి కూడా రాలేకపోతున్నాయి’ అని అఖిలేశ్ అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై ప్రజలకు ఉన్న అనుమానాలను తొలగించడానికే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్టు ఆయన పునరుద్ఘాటించారు. తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, మతతత్వ శక్తుల్ని ఏరిపారేయడానికే కాంగ్రెస్‌తో కూటమి కట్టినట్టు ఆయన స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే రైతుల రుణాలను మాఫీ చేస్తామన్న బిజెపి హామీని అఖిలేశ్ ఎద్దేవా చేశారు. బిజెపి అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, మహారాష్టల్ల్రో ఎందుకు మాఫీ చేయలేదని ఆయన నిలదీశారు. మహారాష్టల్రో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా అక్కడి బిజెపి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.