జాతీయ వార్తలు

ధర్మయుద్ధం కొనసాగిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 16: తమిళనాడులో జయలలిత పాలన పునరుద్ధరణ అయ్యేంతవరకు అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ, ఆమె కుటుంబంపై పోరాటం కొనసాగిస్తామని మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం స్పష్టం చేశారు. ‘పార్టీ, ప్రభుత్వం తిరిగి ఒకే కుటుంబం చేతిలోకి వెళ్లకుండా మేమంతా కలిసికట్టుగా అడ్డుకుంటాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మళ్లీ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం. అప్పటివరకు ఈ పోరాటం కొనసాగుతుంది’ అని ఆయన చెప్పారు. ‘పురచ్చితలైవి అమ్మ పాలన పునరుద్ధరణ అయ్యేంతవరకు మా ధర్మయుద్ధం కొనసాగుతుంది’ అని రాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు శశికళ నమ్మినబంటు, అన్నాడిఎంకె లెజిస్లేచర్ పార్టీ నాయకుడు ఎడప్పాడి కె పళనిస్వామిని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించిన తర్వాత స్పందించిన పన్నీర్‌సెల్వం అన్నారు. పన్నీర్‌సెల్వం మీడియాతో మాట్లాడినప్పుడు ఆయన పక్కన మాజీ రాష్టమ్రంత్రి కెపి మునుసామి, ఆయనకు మద్దతు ఇస్తున్న నాయకులు కూడా ఉన్నారు. తనకు మద్దతు ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు, మద్దతుదారులకు పన్నీర్ సెల్వం కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పన్నీర్‌సెల్వం ఈ నెల 7న శశికళపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ, అన్నాడిఎంకె ఒక కుటుంబం ఆస్తిగా మారకుండా చూడడానికి తాము ఒక పోరాటాన్ని ప్రారంభించామని తెలిపారు. అమ్మ పాలన ప్రజాసంక్షేమం బాటనుంచి పక్కదారి పట్టి ఒక కుటుంబం ప్రయోజనాలను కాపాడే ప్రభుత్వంగా మారకుండా చూడడానికే తాను తిరుగుబాటును ఎంచుకున్నట్లు కూడా ఆయన అన్నారు. తన పోరాటానికి పార్టీ కార్యకర్తలు, జనం భారీ మద్దతు ఇచ్చారని ఆయన స్పష్టం చేస్తూ ఒక రిసార్ట్‌లో బలవంతంగా నిర్బంధించిన ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం ఏర్పాటు కావడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారని, అలాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది ప్రజలు, పార్టీ కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకోకపోవడమేనని కూడా పన్నీర్‌సెల్వం అన్నారు.