జాతీయ వార్తలు

తెలుగు విద్యార్థి హర్యానాలో ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,్ఫబ్రవరి 16: హర్యానాలోగల బిఎంఎల్ ముంజాల్ యూనివర్శిటీలో చదువుతున్న ఖమ్మం జిల్లా వైరాకు చెందిన మణిదీప్ రంగా బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. బిఎంఎల్ ముంజాల్ యూనివర్శిటీలో మణిదీప్ బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షల్లో మణిదీప్ నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై యూనివర్శిటీలో చదువుతున్న విద్యార్థులు ధర్నాకు దిగారు. విద్యార్థి ఆత్మహత్యకు పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం కారణం కాకపోచ్చునని, మరే ఇతర కారణం ఉండవచ్చునని వర్శీటి డీన్ వెల్లడించారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియజేశామని, విద్యార్థి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. స్థానిక పోలీసులు మణిదీప్ ఆత్మహత్య కారణాలపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.