జాతీయ వార్తలు

విశ్వాస పరీక్షను వ్యతిరేకిస్తాం: స్టాలిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 17: పళనిస్వామి విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా తమ పార్టీ ఓటు వేస్తుందని ప్రతిపక్ష డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కె.స్టాలిన్ స్పష్టం చేశారు. హైకమాండ్ ఆదేశానుసారమే తాము వ్యవహరిస్తామని ఎనిమిదిమంది ఎమ్మెల్యేలు కలిగిన కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. 1988లో కూడా అన్నాడిఎంకె పార్టీలో ఈ రకమైన వారసత్వ పోరే తలెత్తింది. అప్పట్లో ఎం.జి.రామచంద్రన్ వారసత్వం కోసం ఆయన భార్య జానకి, జయలలిత తీవ్రంగానే పోటీపడ్డారు. ఎవరిది మెజార్టీ అన్న విషయం తేల్చడానికి అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాల్సి వచ్చింది. అప్పటి అసెంబ్లీ స్పీకర్ పి.హెచ్.పాండ్యన్ అనేకమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. దీంతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఆ బలపరీక్షను బహిష్కరించాయి. అంతిమంగా ఎం.జి.రామచంద్రన్ భార్య జానకి ఆ విశ్వాస పరీక్షలో విజయం సాధించారు.

చిత్రం..డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్