జాతీయ వార్తలు

ఇక చెక్కులు, బ్యాంక్ ఖాతాల్లో జమ ద్వారానే ఉద్యోగులకు జీతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ఇకపై దేశంలోని పారిశ్రామిక సంస్థలు, ఇతర వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులకు జీతాలు చెక్కులు లేదా వారి బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేయడం ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి వేతనాల చెల్లింపు( సవరణ) చట్టం-2017కు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఇటీవల ఆమోదముద్ర వేశారు. ఇటీవల ముగిసిన బడ్జెట్ సమావేశాల తొలి భాగంలో పార్లమెంటు దీనికి సంబంధించిన బిల్లుకు ఆమోదముద్ర వేసింది.
యాజమాన్యాలు తమ ఉద్యోగులకు జీతాలను వారి లిఖితపూర్వక అంగీకారం లేకుండానే చెక్‌ద్వారా లేదా వారి బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేయడం ద్వారా చెల్లించడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది. 1936 నాటి వేతనాల చెల్లింపు చట్టానికి సవరణ చేస్తూ బిల్లును ఈ నెల 3న ప్రవేశపెట్టడానికిముందు రాష్టప్రతి గత ఏడాది డిసెంబర్ 28న ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. ఈ నెల 7న లోక్‌సభ, ఆ మర్నాడు రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించాయి. రాష్టప్రతి ఈ చట్టానికి ఆమోదముద్ర వేయడంతో ఆర్డినెన్స్ రద్దయినట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ కొత్త చట్టంతో తమ సంస్థల్లో పని చేసే ప్రతి ఉద్యోగికి వేతనాలను చెక్కు లేదా ఉద్యోగి బ్యాంక్ ఖాతాకు క్రెడిట్ చేయడం ద్వారా మాత్రమే చెల్లించాలని ప్రభుత్వాలు యాజమాన్యాలను ఆదేశించడానికి వీలవుతుంది.