జాతీయ వార్తలు

రైల్వే బడ్జెట్‌లో అధిక నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంలో పనిచేయడానికి తెలంగాణతో ఇంకా ఒప్పందం కుదరలేదని, దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని రైల్వేబోర్డు అధికారులు తెలిపారు. రైల్వే మంత్రిత్వశాఖ కార్యాలయంలో రైల్వేబోర్డు అధికారులు శుక్రవారం నాడు విలేఖరులతో మాట్లాడారు. సికింద్రాబాద్ -జహీరాబాద్, బోధన్-బీదర్ రైల్వేలైన్లను సంయుక్తం భాగస్వామ్యంలో చేపట్టడానికి రాష్ట్రప్రభుత్వం చర్చలు జరుగుతున్నాయని, అయితే తెలంగాణ ప్రధాన కార్యదర్శి మారినందువల్ల అలస్యమైందని అధికారులు తెలిపారు. దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని వారు వెల్లడించారు. భద్రాచలం-కొవ్వూరు మధ్య రైల్వేలైన్ పూర్తిచేయడానికి బడ్జెట్‌లో కేటాయింపులు జరిపినప్పటికీ భూసేకరణ సమస్య ఉన్నందువల్ల అలస్యమవుతుందని తెలిపారు. తెలంగాణకు రైల్వేబడ్జెట్‌లోగతంలో ఏడాదితో కంటే 118 శాతం నిధులు అధికంగా కేటాయింపులు జరిగినట్టు అధికారులు వెల్లడించారు. గత బడ్జెట్‌లో రూ. 601 కోట్లు కేటాయింస్తే ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.1,729 కోట్లు కేటాయింపులు జరిగినట్లు వారు పేర్కొన్నారు. అలాగే బల్హార్షా-కాజీపే-విజయవాడ మధ్య నాలుగు లైన్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.